నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవం సిడ్నీలో ఆస్ట్రేలియా తెదేపా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాన్బెర్రా, న్యూ క్యాజిల్ నుండి తెలుగువారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సినీనటుడు శివాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 6గంటల పాటు సాగిన కార్యక్రమంలో చిన్నారులు, పెద్దలు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. వేడుకకి హాజరైనవారికి తెలుగింటి వంటకాలతో పసందైన విందు ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ జీవిత ముఖ్యఘట్టాలతో ఏర్పాటు చేసిన డిజిటల్ ఫోటో ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ప్రముఖ కార్డియాలజిస్ట్ ప్రొఫెసర్ క్లారా చౌ, పబ్లిక్ సర్వీసెస్, జ్యూడిషరీ రంగాలలో అందించిన సేవలకు న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర జ్యూడిషరీ కమిషన్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మురళి సాగిలను ఎన్టీఆర్ అవార్డులతో సత్కరించారు. అనంతరం NTR అభిమానులు రక్తదానం చేశారు.
తెలుగుదేశం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ఘనంగా శతజయంతి
Related tags :