దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఒడిదుడుకుల మధ్య కొనసాగిన మార్కెట్లు చివర్లో అమ్మకాల ఒత్తిడికి గురై నష్టాలను మూటకట్టుకున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న మిశ్రమ సంకేతాలు మన మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 193 పాయింట్లు కోల్పోయి 62,428కి పడిపోయింది. నిఫ్టీ 46 పాయింట్లు నష్టపోయి 18,487 వద్ద స్థిరపడింది.