Politics

పరారీలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు…

పరారీలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు…

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారయణ అరెస్టుకు రంగం సిద్ధమైంది. వాణిజ్య పన్నులశాఖలో నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఆయనపై కేసు నమోదు చేసిన ప్రభుత్వం..అరెస్టుకు ఆదేశించింది. రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. సూర్యనారాయణ ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.ఈ కేసులో ఇప్పటికే నలుగురు వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులను అరెస్టు చేయగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు. అయిదో నిందితుడిగా చేర్చిన సూర్యనారాయణ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

తనను పోలీసులు అరెస్టు చేసే ఉద్దేశం ఉందనే అనుమానం రావడంతో ఫోన్లు వదిలేసి శుక్రవారం ఉదయం నుంచే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. దీంతో పోలీసులు సూర్యనారాయణ ఫోన్లు, సహచరుల కదలికలపై నిఘా పెట్టారు. ఆయన తలదాచుకునేందుకు అవకాశం ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ వెతుకుతున్నారు. ఈ కేసులో ఇంకా ఎవరి పాత్ర అయినా ఉందేమో వివరాలు రాబట్టాల్సి ఉందని, అందువల్ల రిమాండ్‌లో ఉన్న మెహర్‌కుమార్‌, సంధ్య, చలపతి, సత్యనారాయణలను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు శుక్రవారం మూడో ఏసీఎంఎం కోర్టులో పిటిషన్‌ వేశారు. పిటిషన్‌ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.