Movies

రైలు ప్రమాదంలో అభిమానులు రక్తదానం చేయాలి చిరంజీవి వ్యాక్యాలు…

రైలు ప్రమాదంలో అభిమానులు రక్తదానం చేయాలి చిరంజీవి వ్యాక్యాలు…

ఒడిశాలో కోరమండల్ రైలు ఘోర ప్రమాద ఘటనపై మెగాస్టార్‌ చిరంజీవి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ప్రమాదంపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే సహాయక చర్యలు అందించాలని మెగా అభిమానులకు చిరంజీవి పిలుపునిచ్చారు. ఈ సమయంలో క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు రక్తం అవసరం ఉంటుందన్నారు. కాబట్టి సమీప ప్రాంతాల్లోని అభిమానులు రక్తదానం చేసి విలువైన ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు.