ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో మూడు రైళ్లు ఒకదానినొకటి ఢీకొన్న దుర్ఘటనలో వందలాది ప్రాణాలు కోల్పోవడం, వేలాది మంది గాయపడడం యావత్ దేశాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. భారతీయ రైల్వే చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిన ఈ విషాద ఘటన ఎలా జరిగిందనే విషయమై ఇప్పటి వరకూ స్పష్టత రాలేదు. అయితే, సిగ్నల్ లోపం కారణంగా కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ మరో ట్రాక్‌లోకి ప్రవేశించడం వల్లే ఈ పెను విషాదం సంభవించినట్లు రైల్వే శాఖ ప్రాథమిక దర్యాప్తు ప్రాథమిక నివేదికలో పేర్కొంది.
ప్రమాదానికి కొద్ది క్షణాల ముందే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్.. లూప్‌లైన్‌లోకి మారినట్లు నివేదికలో పేర్కొన్నారు. చెన్నై వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ మెయిన్ లైన్‌కి బదులుగా లూప్ లైన్‌లోకి ప్రవేశించిందని వెల్లడిరచారు. ఈ రైలు మెయిన్‌లైన్‌లోనే చెన్నై వెళ్లేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం 6.55 గంటలకు బహాన్‌గా స్టేషన్ దాటిన కొద్ది సేపటికే ఈ రైలు పొరపాటున లూప్‌లైన్‌లోకి ప్రవేశించింది. సిగ్నలింగ్‌లో మానవ తప్పిదం కారణంగానే ఇది జరిగి ఉండవచ్చని రైల్వే అధికారి ఒకరు వెల్లడిరచారు.
సిగ్నలింగ్‌లో మానవ తప్పిదం కారణంగానే ఇది జరిగి ఉండొచ్చని రైల్వే అధికారి ఒకరు వెల్లడించారు. ప్రమాద సమయంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ గంటకు 130 కి.మీల వేగంతో వెళ్తోంది. దీంతో లూప్‌లైన్ ఉన్న గూడ్స్ రైలును గుర్తించినా వేగాన్ని నియంత్రించలేకపోయినట్లు తెలుస్తోంది. గూడ్స్‌ను ఢీకొట్టగానే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఇంజిన్.. దానిమీదకు దూసుకెళ్లినట్లు రైల్వే అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఫలితంగా కొన్ని బోగీలు గాల్లోకి ఎగిరిపడ్డాయి. దీంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.