Movies

ఒడిశా రైలు ప్రమాద బాధితులకు పరిహారం పై సోనూ వ్యాఖ్యలు….

ఒడిశా రైలు ప్రమాద బాధితులకు  పరిహారం పై  సోనూ వ్యాఖ్యలు….

ఒడిశాలో రైలు ప్రమాద వార్త వినగానే గుండె పగిలిందని సోనూసూద్ అన్నారు.రాత్రికి రాత్రి చాలా కుటుంబాలు చెదిరిపోయాయి.’ ఇప్పుడు ప్రకటించిన పరిహారం 2, 3నెలల్లో ఖర్చయిపోతుంది. కాళ్లు, చేతులు విరిగిపోయిన వారు ఆ తర్వాత ఎలా బతుకుతారు? ఒడిశా రైలు ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలకు జీవితకాలం పెన్షన్లు లేదా స్థిరమైన నెలవారీ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశాడు రియల్ హీరో సోనూ సూద్‌. ఈ ప్రమాదం చాలా దారుణమని ప్రతి ఒక్కరు తమవంతుగా సహాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చాడు.