NRI-NRT

సిడ్నీలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు…

సిడ్నీలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ  వేడుకలు…

సిడ్నీ: ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో (ఏటీఫ్) ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను – -కల్చరల్ నైట్ రూపం లో నిర్వహించారు.

స్థానిక హార్వే లోవే పెవిలియన్ – కాజిల్ హిల్సెలో ఏర్పాటు చేసిన తెలంగాణా కల్చరల్ నైట్ ఘనంగా జరిగింది. సిడ్నీ మెట్రో ప్రాంతం నుంచి ఎముకలు కొరికే చలిలో కూడా దాదాపుగా 800 వందల మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

తెలంగాణ కల్చరల్ నైట్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక పారామాటా- మేయర్ సమీర్ పాండే (Sameer Pandey) ; బ్లాక్ టౌన్ కౌన్సిలర్ లివింగ్ స్టన్ చిటిపల్లి (Livingston Chettipally); తెలంగాణ గవర్నర్ సెక్రటరీ – శ్రీ సురేంద్ర మోహన్ గారు (Surendra Mohan); హాజరయ్యారు. .

తొలుత ఏటీఫ్ కోశాధికారి వినయ్ కుమార్ యమ (Vinay Kumar Yama) మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధనలో తమవంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అహర్నిశలూ కృషి చేసిన ఏటీఫ్ కార్యవర్గ సభ్యు లను కొనియాడారు తరువాత తెలంగాణ అమరులకు, జయశంకర్ సార్కు నివాళి అర్పించి తెలంగాణ ఆటా, పాటలతో సభా ప్రాంగణం హోరెత్తింది. వేడుకలు జరుగుతున్న ప్రాంతమంతా ‘జై తెలంగాణ’ నినాదాలతో మారుమోగిపోయింది.

పిల్లలు, పెద్దలు తమ ఆట పాటలతో అతిథులను ఉర్రూతలూగించారు. ఇక్కడ నివసిస్తున్న తెలంగాణ వాదులలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తాజాగా కలిగించే లక్ష్యంతో ఈ సాంస్కృతిక కార్యక్రమం జరిగింది. పెద్దలతో పాటలు పిల్లలు కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక చిన్నారుల చేసిన తెలంగాణా జానపద గీతాలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కార్యక్రమానికి మరింత శోభను చేకూర్చాయి, అతిథులను విశేషంగా అలరించాయి.

సిడ్నీ బతుకమ్మ &దసరా ఫెస్టివల్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్(SBDF)ఆధ్వర్యంలో నిర్వహించనున్నబతుకమ్మ పోస్టర్‌ను శ్రీ సురేంద్ర మోహన్ గారు (Surendhra Mohan IAS) ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రెసిడెంట్ ప్రశాంత్ కుమార్ కడపర్తి (Prashanth Kumar Kadaparthi)మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరులను, పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు దశాబ్ది ముంగిట నిలిచిన సందర్భంలో 60 ఏండ్ల పోరాట చరిత్రను ఈ సందర్భంగా గుర్తు చేశారు. స్వరాష్ట్రం సిద్ధించాక తొమ్మిదేండ్లలో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉన్నదని, బంగారు తెలంగాణ నిర్మాణంలో మనమందరం బాధ్యత వహించాలని కోరారు. ఏటీఫ్ ఆశయాలను సభకు వివరించారు.కుల,మత, ప్రాంతాలకు అతీతంగా తెలుగువారందరూ కలిసిమెలిసి ఉండాల్సిన ఆవశ్యకతను ఉందన్నారు.

ప్రధాన కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి ముద్దం (Goverdhan Reddy Muddam)అందరూ ఒక్కచోటకూడి ఇలా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను జరుపుకోవడంచాలా ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సభ్యులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు వాణి ఏలేటి, ప్రధాన కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి ముద్దం, కోశాధికారి వినయ్ కుమార్ యమ, పబ్లిక్ ఆఫీసర్ అశోక్ మలీష్, సాంస్కృతిక కార్యదర్శి విద్యారెడ్డి సేరి, సంయుక్త కార్యదర్శి మలిఖార్జున అవిరేణి, SBDF చైర్మన్ అనిల్ మునుగల, SBDF కార్యదర్శి వాసు టూటుకూరు, ప్రదీప్ సేరి, కావ్య రెడ్డి గుమ్మడవాలి, ప్రమోద్ ఏలేటి, , సందీప్ మునగాల, శశి మానేం, డేవిడ్ రాజు, ఇంద్రసేన్ రెడ్డి, నర్సింహా రెడ్డి, రామ్ గుమ్మడవాలి, అశోక్ మరం, కిరణ్ అల్లూరి, హేమంత్ గంగు తదితరులు పాల్గొన్నారు.

స్పాన్సర్స్‌కు సభ్యులందరికీ ప్రతిఒక్కరికీ, ఫేస్‌బుక్ లైవ్‌లో చూసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.