ఇవాళ ఏపీ కేబినెట్ కీలక సమావేశం జరుగనుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. సీపీఎస్ రద్దుపై నిర్ణయం తీసుకోనుంది మంత్రిమండలి. సీపీఎస్ స్థానంలో కొత్త విధానానికి ఆమోదం తెలపనున్న ఏపీ కేబినెట్. పాత పింఛను పథకానికి సమానంగా ఉండే పథకాన్ని తీసుకురానున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత వచ్చే 50% పింఛనుకు తగ్గకుండా.. అలాగే డీఏ క్రమంగా పెరిగేలా ఆలోచన చేయనున్నారు.ఖరీఫ్ సీజన్లో విత్తనాలు, ఎరువుల సరఫరాపై సమీక్షిస్తారని తెలుస్తోంది.