ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన తర్వాత ఈజిప్ట్ కు వెళ్లనున్నారని సమాచారం. మోదీ ఈజిప్ట్ పర్యటన అధికారికంగా ఖరారు కానప్పటికీ జూన్ చివరి వారంలో వెళ్లే ఆ దేశానికి వెళ్లనున్నారని తెలుస్తోంది. ప్రధాని మోదీ జూన్ 21 నుంచి 24 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. ఆ వెంటనే ఆయన ఈజిప్టుకు వెళ్లే అవకాశం ఉండటంతో పర్యటన షెడ్యూల్ ను అధికారులు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
మోదీ ఈజిప్టు టూర్ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలపడే అవకాశాలున్నాయి. కాగా ఈ ఏడాది గణతంత్ర్య దినోత్సవ వేడుకలను ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్-ఫతా-ఎల్-సిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గణతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొన్న తొలి ఈజిప్టు నాయకుడు కూడా సీసీనే. భారత్ ఈజిప్టు మధ్య గత కొన్ని దశాబ్దాలుగా సన్నిహిత సంబంధాలున్నాయి. ఈజిప్టు అధ్యక్షుడు భారత్ కు వచ్చిన ఐదు నెలల తర్వాత భారత ప్రధాని ఆ దేశంలో పర్యటించనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.