పార్టీగేట్ ఆరోపణలపై యూకే మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్.. తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఉక్స్‌బ్రిడ్జ్ సౌత్ రూయిస్లిప్ నుంచి ఎంపీగా ఉన్న బోరిస్.. పార్లమెంటును పక్కదారి పట్టించారన్న ఆరోపణలపై ప్రివిలేజెస్ కమిటీ నివేదిక రావాల్సిన క్రమంలో ఈ పదవికి రాజీనామా ప్రకటించారు. కొవిడ్ సమయంలో చట్టాన్ని ఉల్లంఘించి.. పార్టీ చేసుకున్నారని బోరిస్ జాన్సన్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో హౌస్ ఆఫ్ కామన్స్‌ని ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించారని విమర్శలు వచ్చాయి. ఎంపీ పదవికి రాజీనామా చేయడం బాధ కలిగించినట్లు ఈ నేపథ్యంలో బోరిస్ తెలిపారు. వెంటనే ఉప ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు.
తనను పార్లమెంటు నుంచి బయటకు పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. ఎంపీగా రాజీనామా చేస్తూ.. ఓ స్టేట్మెంట్ సైతం ఆయన విడుదల చేశారు. తాను అబద్ధం చెప్పలేదని.. కమిటీకి కూడా ఈ విషయం తెలుసుని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నాడు. కమిటీని ‘కంగారూ కోర్టు’గా అభివర్ణించారు బోరిస్ జాన్సస్. వాస్తవాలతో సంబంధం లేకుండా మొదటి నుంచే తనని దోషిగా గుర్తించడం దాని ఉద్దేశమన్నారు.