Politics

చంద్రబాబుతో వైసీపీ ఎమ్మెల్యే ఆనం భేటీ….

చంద్రబాబుతో వైసీపీ  ఎమ్మెల్యే ఆనం భేటీ….

వైసిపి నుంచి సస్పెండ్ అయిన వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి,హైదరాబాద్ లో నిన్న నారా చంద్రబాబు నాయుడుతో కీలక సమావేశం అయ్యారు.సుమారు గంటన్నర పాటు నెల్లూరు జిల్లా రాజకీయాలపై వీరిద్దరు చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం వైయస్సార్ జిల్లాలో కొనసాగుతున్న లోకేష్ పాదయాత్ర గురించి కూడా వివరాలు తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి,టిడిపిలో చేరడం పై కూడా వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం అందుతుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం మరో వారం రోజుల్లో,టిడిపి కండువా కప్పుకునేందుకు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సిద్ధమైనట్లు తెలుస్తోంది.