ఒకే రన్‌వే పైకి రెండు విమానాలు వచ్చిన ఘటన జపాన్‌లో చోటు చేసుకుంది. ఈ రెండు విమానాలు ఒకదాని మరొకటి తాకినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. జపాన్ రాజధాని టోక్యో నగరంలోని హనెడా ఎయిర్‌పోర్ట్‌లో ఇవాళ ఉదయం 11 గంటలకు ఒకే రన్ వేపైకి రెండు విమానాలు వచ్చాయి.
థాయ్ ఎయిర్‌వేస్ చెందిన విమానం, తైవాన్‌కు చెందిన ఎవా ఎయిర్‌వేస్ చెందిన ఫ్లైట్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు విమానాలు చాలా దగ్గరి నుంచి వెళ్లినట్లు, ఒక సమయంలో రెండు విమానాలు ఒకదానికి మరొకటి తాకినట్లు తెలిపారు. అయితే సిగ్నల్ వ్యవస్థలో లోపం వల్లే రెండు విమానాలు ఒక రన్ వే పైకి వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు.