Devotional

ఈ వారం మీ రాశి ఫలితాలు

ఈ వారం మీ రాశి ఫలితాలు

హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
✍🏻 (11-06-2023 నుండి 17-06-2023) ✍🏻
🗓 ఈ వారం మీ రాశి ఫలితాలు

🐐 మేషం (11-06-2023 నుండి 17-06-2023)

వృత్తి, ఉద్యోగ,వ్యాపారాల్లో శుభకాలం. పట్టుదలతో లక్ష్యాలను చేరతారు. పూర్వపుణ్యం కాపాడుతోంది. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. ఆ మేరకు కొత్త నైపుణ్యాలను సంపాదిస్తారు. ఇంట్లో శుభకార్యక్రమాలు జరుగుతాయి. కీలక వ్యవహారాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి. ఊహించిన ఫలితాలను అందుకుంటారు. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. సూర్యుణ్ణి ప్రార్థిస్తే మంచిది.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం (11-06-2023 నుండి 17-06-2023)

కార్యసిద్ధి ఉంది. మీ రంగాల్లో విజయాలు సాధిస్తారు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఉన్నాయి. మీ చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరాలకు పనులు పూర్తవుతాయి. వ్యాపార లాభాలు ఉన్నాయి. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. అనవసరమైన విషయాలతో సమయం వృథా చేయవద్దు. ముఖ్య విషయాల్లో మృదు సంభాషణ అవసరం. ఆర్థికాంశాలలో అభివృద్ధి సాధిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వాచా దోషం పెరగకుండా చూసుకోవాలి. విష్ణు ఆరాధన శుభప్రదం.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం (11-06-2023 నుండి 17-06-2023)

మనోధైర్యంతో చేసే పనులు శుభాన్ని చేకూరుస్తాయి. అప్పగించిన బాధ్యతలను సమర్ధంగా పూర్తిచేస్తారు. సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించి సత్ఫలితాలను పొందుతారు. సమన్వయలోపం లేకుండా చూసుకోవాలి. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోరాదు. నూతన కార్యక్రమాలు ప్రారంభించే ముందు సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఇబ్బంది పెట్టే వారితో జాగ్రత్త. మాట విలువను కాపాడుకోవాలి. కుటుంబ సభ్యుల సలహాల వల్ల మంచి జరుగుతుంది. వారాంతంలో మేలైన ఫలితాలను పొందుతారు. ప్రయాణాలలో జాగ్రత్త. ఇష్టదేవతా దర్శనం శుభప్రదం.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం (11-06-2023 నుండి 17-06-2023)

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపారంలో ఉన్నాయి.అభీష్ట లాభాలు నెరవేరుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్య వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. అనవసర ఖర్చులు జరిగే అవకాశం ఉంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శత్రువులకు దూరంగా ఉండాలి. శివారాధన శుభప్రదం.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం (11-06-2023 నుండి 17-06-2023)

మీ రంగాల్లో శుభఫలితాలు ఉన్నాయి. అదృష్టయోగం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్యమైన వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ప్రారంభించిన కార్యక్రమాలలో ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. వ్యాపారపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ధైర్యంగా ముందుకు సాగితే అనుకున్నది దక్కుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.
🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య (11-06-2023 నుండి 17-06-2023)

గ్రహబలం విశేషంగా యోగిస్తోంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. వ్యాపారంలో శుభఫలితాలు ఉన్నాయి. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. మీ స్వధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి . శాంతిపూరితమైన వాతావరణం ఉంది. విష్ణు స్తుతి శుభప్రదం.
💃💃💃💃💃💃💃

⚖ తుల (11-06-2023 నుండి 17-06-2023)

మిశ్రమకాలం. ముఖ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. మీ రంగాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఓర్పుతో ఎదుర్కోవాలి. ఒక వ్యవహారంలో మీకు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. అందరినీ కలుపుకొనిపోవడంవల్ల అనుకున్న కార్యక్రమాలు త్వరగా సిద్ధిస్తాయి. ఆగ్రహావేశాలకు పోరాదు. అనవసర ఖర్చులు తప్పవు. కొందరి ప్రవర్తన మీ మనసును చికాకు పరుస్తుంది. అకారణ కలహసూచన ఉంది. వాదనలకు దూరంగా ఉండటమే మంచిది. దైవారాధన ఎట్టిపరిస్థితుల్లోనూ మానకండి. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. నవగ్రహ ధ్యాన శ్లోకాలను చదవాలి.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం (11-06-2023 నుండి 17-06-2023)

మీ రంగాల్లో ఉత్సాహంగా పనిచేయండి. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. సమాజంలో మంచి పేరు దక్కుతుంది. ఇంటాబయటా శాంతి లభిస్తుంది. దైవబలం కాపాడుతోంది. వారం మధ్యలో ఒక అవాంతరం జరుగుతుంది. సమయపాలన పాటించండి. ఆరోగ్యంపై అశ్రద్ధ వద్దు. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇస్తూ ముందుకెళ్లండి. మంచి జరుగుతుంది. ప్రయాణాలలో ఎదురవకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. నవగ్రహ దర్శనం శుభప్రదం.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు (11-06-2023 నుండి 17-06-2023)

ఉత్తమకాలం నడుస్తోంది. శుభయోగాలు ఉన్నాయి. ప్రతిభతో విజయం సాధిస్తారు. కేవలం అభివృద్ధి కోసమే కాలాన్ని వెచ్చించండి. వ్యాపారంలో అనూహ్యమైన లాభాలు సొంతం అవుతాయి. తోటి వారి ఆదరాభిమానాలు ఉంటాయి. మిత్రుల సంఖ్య పెరుగుతుంది. ఆర్థిక అభివృద్ధి ఉంది. ఇంట్లో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ఆర్థిక లాభాలు ఉన్నాయి. శ్రీలక్ష్మీదేవి నామస్మరణ శక్తిని ఇస్తుంది.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం (11-06-2023 నుండి 17-06-2023)

మిశ్రమ వాతావరణం కలదు. కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పట్టుదలతో పనిచేయండి. లక్ష్యాన్ని చేరుకుంటారు. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది. అనుకున్న పనులు చేయడానికి బాగా శ్రమించాల్సి వస్తుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారం లాభించినా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని విషయాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. నవగ్రహ ధ్యానం మంచిది.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం (11-06-2023 నుండి 17-06-2023)

ప్రారంభించిన కార్యక్రమాల్లో అదృష్టం వరిస్తుంది. తోటివారి సహాయ సహకారాలు ఉన్నాయి. అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగితే అనుకూలత. ఒక శుభవార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అభివృద్ధికి తోడ్పడే నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్థిరచిత్తంతో వ్యవహరిస్తే శుభం చేకూరుతుంది. విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవబలం రక్షిస్తోంది. వ్యాపారంలో అవగాహనాలోపం లేకుండా చూసుకోవాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణ అనుకూలత ఉంది. శుక్ర ధ్యానం శుభప్రదం.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం (11-06-2023 నుండి 17-06-2023)

పట్టుదలతో విజయం సిద్దిస్తుంది. ప్రారంభించిన పనులను వాయిదా వేయకండి. శ్రమ పెరుగుతుంది. లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి. నిరంతర శ్రమతో అనుకున్నది దక్కుతుంది. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు. మొహమాటంతో ఇబ్బందులు ఎదురవుతాయి. తోటివారిని కలుపుకొనిపోవడం వల్ల పనులు తొందరగా పూర్తవుతాయి. గిట్టనివారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆదాయానికి తగ్గ ఖర్చులు ఉంటాయి. ఎవరితోనూ వాదోపవాదాలు వద్దు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఇష్టదైవ నామస్మరణ శుభప్రదం.
🦈🦈🦈🦈🦈🦈🦈