తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో గ్రేటర్ టోరంటో నగరంలోని తెలంగాణ వాసులు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని Dhoom Dham 2023 ఉత్సవాలు అనాపిలిస్ హాల్స్, మిస్సిసాగా, కెనడాలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సంబరాలలో 1500 కు పైగా తెలంగాణవాసులు పాల్గొన్నారు.
ఈ సంబరాలు కమిటీ కార్యదర్శి శ్రీ శంతన్ నేరళ్లపల్లి గారు ప్రారంభించగా , శ్రీమతి లావణ్య ఏళ్ల, శ్రీమతి అనూష ఇమ్మడి, శ్రీమతి స్వాతి అర్గుల, శ్రీమతి రాధిక దలువాయి మరియు శ్రీమతి రజిని తోట గార్లు జ్యోతి ప్రజ్వలన చేసారు. ఈ సందర్బంగా ప్రెసిడెంట్ అఫ్ తెలంగాణ కెనడా అసోసియేషన్ శ్రీ శ్రీనివాస్ మన్నెం గారు, కార్యదర్శి శ్రీ శంతన్ నేరళ్లపల్లి గారు, ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ నవీన్ ఆకుల గారు మరియు వ్యవస్థాపక కమిటీ చైర్మన్ శ్రీ అతిక్ పాషా గారు వేదిక పై పాల్గొన్నారు.
ఆరంభ ప్రసంగం తో అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సంవత్సరం మునుపెన్నడు లేనట్టుగా చిన్నారులకు టాలెంట్ షో ని నిర్వహించారు. దీనికి చిన్నారుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. చిన్నారులు సింగింగ్, డాన్సింగ్, రూబిక్స్ క్యూబ్ మరియు మెంటల్ మ్యాథ్స్ లాంటి విభాగాలలో వారి టాలెంట్ ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి శ్రీమతి ఉమా సలాడి గారు, శ్రీమతి లక్ష్మీ సంధ్యా గారు, శ్రీ భరత్ గారు మరియు శ్రీమతి మనస్విని గారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. దీనికి వ్యాఖ్యాతలుగా శ్రీమతి గుప్తేశ్వరి వాసుపిల్లి గారు మరియు శ్రీమతి మాధురి చాతరాజు గారు వ్యవహరించారు.
ఈ షోలో గెలిచిన చిన్నారులకి శ్రీ విష్ణు బోడ (రియల్టర్) బహుమతులను అందజేశారు. చిన్నారులని వారి వయసును బట్టి రెండు గ్రూపులుగా విభజించారు. అనికా శ్యామల(10), సాయి స్నిగ్ధ తంగిరాల(8) మొదటి స్థానము ఆకాంక్ష(11), శివాన్ష్ దవల(7) రెండవ స్థానము మరియు జడ్జెస్ స్పెషల్ చాయిస్ గా ఆర్యన్ పొనుగంటి(11) శ్రీతన్ పూల(10) మాన్య నాగబండి(9), శ్రీరామదాసు అరుగుల(7), విద్వాన్ష్ రాచకొండ(5) గెలిచారు. ఈ కార్యక్రమం మొత్తం నాలుగు గంటల పాటు ఉమెన్స్ కమిటీ సభ్యులు శ్రీమతి రాధికా బెజ్జంకి మరియు శ్రీమతి మాధురి చాతరాజు ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసింది.
అనంతరం సాంస్కృతిక కార్యక్రమలను కుమారి ప్రహళిక మ్యాకల, శ్రీ రాహుల్ బాలనేని, కుమారి ధాత్రి అంబటి మరియు శ్రీమతి స్ఫూర్తి కొప్పు వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తూ ఈ వేడుక స్పాన్సర్ బెస్ట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్ ట్యూటరింగ్ సంస్థలకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ప్రారంభించారు.
ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీ శుభన్ క్రిషన్- కెనడా కాన్సుల్-కౌన్సిలేట్ జనరల్ ఆఫ్ ఇండియా, మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా TCA నిర్వహిస్తున్న కార్యక్రమాలని హర్షించారు. కల్చరల్ విభాగంలో పాల్గొన్న చిన్నారులని ప్రోత్సాహించి నందుకు TCA ను అభినందించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పిల్లలు పెద్దలు పాల్గొని ప్రేక్షకులను అలరింపజేసారు.
అనంతరం అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ మన్నెం గారు మాట్లాడుతూ TCA ఈవెంట్స్ స్పాన్సర్లకి, నిర్వహకులకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. TCA ఎన్నెన్నో సాంస్కృతిక కార్యక్రమాలు లోకల్ టాలెంట్ తో కలర్ ఫుల్ గా ఆర్గనైజ్ చెయ్యడం పలువురు ప్రశంసించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు TCA లోకల్ బిజినెస్ లని కూడా ప్రతి వేడుకల్లో ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా 16 విభిన్నమైన వెండర్ స్టాల్స్ ని ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా TCA తెలంగాణ ప్రామాణికమైన బిర్యాని వడ్డించటము సభికులకు ఆనందాన్ని కలుగ చేసింది.
ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక మండలి అధ్యక్షుడు శ్రీ శ్రీనివాస్ మన్నెం, కార్యదర్శి శ్రీ శంతన్ నేరళ్లపల్లి, సంయుక్త సాంస్కృతిక కార్యదర్శి కుమారి ప్రహళిక మ్యాకల, కోశాధికారి శ్రీ వేణుగోపాల్ ఏళ్ల, సంయుక్త కోశాధికారి శ్రీ రాహుల్ బాలనేని, డైరెక్టర్లు – శ్రీ నాగేశ్వరరావు దలువాయి, శ్రీ ప్రవీణ్ కుమార్ సామల, శ్రీ ప్రణీత్ పాలడుగు, శ్రీ శంకర్ భరద్వాజ పోపూరి, శ్రీ భగీరథ దాస్ అర్గుల మరియు యూత్ డైరెక్టర్ కుమారి ధాత్రి అంబటి, ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ నవీన్ ఆకుల, బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ సభ్యులు – శ్రీ మురళి సిరినేని, శ్రీ మురళీధర్ కందివనం మరియు శ్రీమతి మాధురి చాతరాజు, వ్యవస్థాపక కమిటీ చైర్మన్ శ్రీ అతిక్ పాషా, వ్యవస్థాపక సభ్యులు – శ్రీ దేవేందర్ రెడ్డి గుజ్జుల, శ్రీ కోటేశ్వర రావు చిత్తలూరి, శ్రీ ప్రకాష్ చిట్యాల, శ్రీ శ్రీనివాస తిరునగరి, శ్రీ హరి రావుల్, శ్రీ కలీముద్దీన్ మొహమ్మద్, శ్రీ ప్రభాకర్ కంబాలపల్లి, శ్రీ సంతోష్ గజవాడ, శ్రీ విజయ్ కుమార్ తిరుమలపురం, శ్రీ రాజేశ్వర్ ఈధ, శ్రీ వేణుగోపాల్ రోకండ్ల మరియు పలువురు సంస్థ శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. కెనడా తెలంగాణ అసోసియేషన్(TCA) విందు ఏర్పాట్లు ఘనంగా జరిగింది.
చివరగా అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ మన్నెం గారి కృతజ్ఞతా వందన సమర్పణతో తెలంగాణ ధూంధాం 2023 వేడుకలు కెనడా టొరంటో లో ఘనంగా ముగిసినది.