Politics

అమిత్ షాకు స్టాలిన్ కౌంటర్….

అమిత్ షాకు స్టాలిన్ కౌంటర్….

“దేశ ప్రధాని పీఠంపై తమిళుడిని చూడాలని కోరుకుంటున్న” అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. “ప్రధాని మోడీపై అమిత్ షా ఎందుకు కోపంగా ఉన్నారో” అని కామెంట్ చేశారు. “తమిళుడిని ప్రధాని చేయాలనే అమిత్ షా ప్రతిపాదనను నేను స్వాగతిస్తున్నాను.. ఇంతకీ మోడీపై అమిత్ షాకు ఉన్న కోపం ఏమిటో నాకు అర్ధం కావడం లేదు” అని పేర్కొన్నారు.

“తమిళుడిని ప్రధాని చేయాలనే ఆలోచన బీజేపీకి ఉంటే.. తమిళిసై సౌందరరాజన్ (తెలంగాణ గవర్నర్), ఎల్ మురుగన్ (కేంద్ర మంత్రి) ఉన్నారు. ప్రధానమంత్రి అభ్యర్థులుగా వాళ్ళ పేర్లను పరిశీలించండి” అని సూచించారు. గతంలో కె. కామరాజ్, జి.కె. మూపనార్‌లను ప్రధానమంత్రులు కాకుండా డీఎంకే అడ్డుకున్నదని బీజేపీ అంతర్గత సమావేశంలో అమిత్‌ షా చేసిన ఆరోపణను స్టాలిన్ ఖండించారు. దీనిపై బీజేపీ పబ్లిక్‌గా మాట్లాడితే తాము వివరంగా ఆన్సర్ ఇస్తామని స్పష్టం చేశారు.