ఇండియా-చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం తీవ్రంగా మారుతోంది. ఈ క్రమంలోనే జర్నలిస్టుల విషయంలో ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తాజాగా చైనాలో ఉన్న ఒకే ఒక్క భారత్ జర్నలిస్టును ఈ నెలాఖరులోగా తమ దేశం వదిలి వెళ్లాలంటూ డ్రాగన్ దేశం వార్నింగ్ ఇచ్చిది. ఇప్పటికే అక్కడ విధులు నిర్వహిస్తోన్న ముగ్గురు భారత జర్నలిస్టులను చైనా ఇండియాకు పంపించింది.
తాజాగా పీటీఐకి చెందిన జర్నలిస్టుకు దేశం విడిచి వెళ్లిపోవాలని చైనా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా తమ దేశానికి చెందిన ఇద్దరు జర్నలిస్టుల వీసాలను భారత్ తిరస్కరించిందని చైనా ఆరోపించగా.. అలాంటిదేమీ లేదని భారత అధికారులు తెలిపారు. కావాలనే చైనా ఇదంతా చేస్తోందని విమర్శలు గుప్పించారు.