Politics

పవన్‌పై పేర్నినాని సంచలన వ్యాఖ్యలు…..

పవన్‌పై పేర్నినాని సంచలన వ్యాఖ్యలు…..

వారాహి విజయయాత్రలో భాగంగా పవన్‌ కల్యాణ్‌ కత్తిపూడి జంక్షన్‌ సభలో చేసిన వ్యాఖ్యలను వైసీపీ మంత్రులు, నాయకులు తప్పుబడుతున్నారు. అర్థరహితమైన విమర్శలు చేయడం పవన్‌ కల్యాణ్‌ మానుకోవాలంటూ ఫైర్ అవుతున్నారు. ఈ తరుణంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. పవన్‌ది వారాహి కాదు.. నారాహి అంటూ పేర్ని నాని ఫైర్ అయ్యారు. పవన్ ఒక చెప్పు చూపిస్తే నేను రెండు చెప్పులు చూపిస్తానంటూ రెండు చెప్పులు చూపించారు. చంద్రబాబును అధికారంలోకి తేవడమే పవన్ లక్ష్యమని.. చంద్రబాబు బాగు కోసం ఆయన ఏదైనా చేస్తారంటూ విమర్శించారు. పవన్ కల్యాణ్ సొల్లు ఆపాలి.. లేకపోతే మక్కెలు విరిగిపోతాయ్.. జాగ్రత్త అంటూ నాని ఫైర్ అయ్యారు. జనసేనను బాబు నడిపిస్తున్నారని.. ఈ విషయం అందరికీ తెలుసన్నరు. ప్రజలను నమ్ముకుంటేనే అసెంబ్లీకి వెళ్తావని, వ్యూహాలను నమ్ముకుంటే గేటు కూడా తాకలేవని పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ ప్రజల కంటే తను ఎక్కిన లారీ మీద ఎక్కువ దృష్టి పెట్టారు.. అమ్మవారు పేరు పెట్టి రాజకీయాలకు వాడుకుంటున్నారంటూ పేర్నినాని పేర్కొన్నారు. గతంలో ప్రసంగాలు వింటే నేనేనా అని పవన్ కల్యాణే ఆశ్చర్యపోతున్నారు.. ఇంకా ప్రజలకు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో అంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు పచ్చగా ఉండాలన్నదే పవన్ కళ్యాణ్ వ్యూహం.. పాలించేవాళ్ళ చొక్కా పట్టుకుంటా అన్నాడు..మోడీ, చంద్రబాబుల చొక్కా ఎన్నిసార్లు పట్టుకున్నారన్నారు. పదేళ్లుగా జనసేనని నడిపేది పవన్ కాదు చంద్రబాబు.. ఆఫీస్ స్థలం ఎవరిదో తెలియదా..? ఎవరిచ్చారో తెలియదా..? పవన్ కళ్యాణ్, టీడీపీ, బీజేపీ కలిపి దోపిడీ పాలన అందించారన్నారు. కేసీఆర్ సంక నాకింది ఎవరంటూ ప్రశ్నించారు. టికెట్లు రేట్లు పెంచుకోడానికి, బ్లాక్ లో టికెట్లు అమ్ముకోడానికి పెర్మీషన్ తీసుకునేది ఎవరు.. బీజేపీతో పొత్తులో ఉండి కేసీఆర్ తో కలిసేది ఎవరు..? హరీష్ రావు ఆంధ్రా వాళ్ళని తిడితే హరీష్ రావు కి మద్దతిచేది ఎవరు.. పవన్ కళ్యాణ్ కాదా..? అంటూ పేర్నొ్నారు.