టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఇటీవలి కాలంలో పలుమార్లు సీఎం జగన్‌ని కలిసిన సంగతి తెలిసిందే. అదే బాటలో మరో ఆటగాడు కూడా గురువారం జగన్‌ని కలిశాడు.ఈ సందర్భంగా భారత జట్టులోని ఆటగాళ్లు ఆటోగ్రాఫ్ చేసిన టెస్ట్ జెర్సీని జగన్‌కి బహూకరించాడు. ఆ తర్వాత భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు భరత్‌ను జగన్ అభినందించారు. ఇంకా భవిష్యత్‌లో టీమిండియాకు ఎన్నో విజయాలను సాధించి పెట్టాలని జగన్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.