DailyDose

తిరుపతిలో అగ్నిప్రమాదం…..

తిరుపతిలో  అగ్నిప్రమాదం…..

తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నాలుగు అంతస్తుల బిల్డింగ్ లో మంటలు ఎగసిపడుతున్నాయి. బిల్డింగ్ లో ఉన్న ప్రఖ్యాత ఫొటో ఫ్రేమ్స్ షాపు లావణ్య ఫ్రేమ్స్ లో ప్రమాదం సంభవించింది. బిల్డింగ్ మొత్తంలో ఈ షాప్ ఉంటుంది. దేవుళ్లకు సంబంధించిన వేలాది ఫొటోలు ఈ షాప్ లో ఉంటాయి. మరోపైపు ఈ బిల్డింగ్ పక్కనే గోవిందరాజు స్వామి వారి ఆలయన రథం ఉంది. మంటల సెగ రథానికి తగులుతోంది. అగ్నిప్రమాదం నేపథ్యంలో మాడ వీధుల్లో రాకపోకలను నిలిపివేశారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక్ సిబ్బంది శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. అగ్నిప్రమాదంలో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.