Business

లాభాల్లో ముగిసిన మార్కెట్లు…

లాభాల్లో ముగిసిన మార్కెట్లు…

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 467 పాయింట్లు లాభపడి 63,385కి చేరుకుంది. నిఫ్టీ 138 పాయింట్లు పెరిగి 18,826కి ఎగబాకింది. కన్జ్యూమర్ గూడ్స్, బ్యాంకెక్స్, పీఎస్యూ తదితర సూచీలు లాభాలను ముందుండి నడిపించాయి. ఫైనాన్స్, ఐటీ, రియాల్టీ, టెక్ సూచీలు నష్టపోయాయి