Sports

6 బంతులకు 6 వికెట్లు….

6 బంతులకు 6 వికెట్లు….

క్రికెట్‌లో ఓ బౌలర్‌ హ్యాట్రిక్‌ సాధించడమే చాలా అరుదు. అలాంటిది ఇంగ్లండ్‌కు చెందిన ఓ బుడ్డోడు ఒకే ఓవర్‌లో డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించి చరిత్ర సృష్టించాడు. బ్రోమ్స్‌గ్రోవ్ క్రికెట్ క్లబ్‌కు ఆడుతున్న ఒలివర్ వైట్‌హౌజ్ అనే 12 ఏళ్ల కుర్రాడు.. కుక్‌హిల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.

ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో 6 బంతుల్లో 6 వికెట్లు తీయడం ఇదే తొలి సారి. ఈ విషయాన్ని బ్రోమ్స్‌గ్రోవ్ క్రికెట్ క్లబ్‌ ట్విట్టర్ వేదికగా షేర్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన వైట్‌హౌజ్ మొత్తం 8 వికెట్లు పడగొట్టాడు. పైగా ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. కాగా, వైట్‌హౌజ్ అమ్మమ్మ యాన్ జోన్స్ 1969లో వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్ అని తెలుస్తోంది.