మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన యువతి సుధీర్ జగ్తాప్(16 ఏళ్లు) అరుదైన ఘనత సాధించింది. ఏకంగా 127గంటల పాటు డ్యాన్స్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.అప్పటి వరకు ఉన్న 126 గంటల సుదీర్ఘ డ్యాన్స్ మారథాన్ రికార్డును బద్దలు కొట్టింది.2018లో నేపాల్ డ్యాన్సర్ బందానా నేపాల్ 126 గంటల పాటు నృత్యం చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కాడు.సుధీర్ జగ్తాప్ డ్యాన్స్ మారథాన్ ఆమె కళాశాల ఆడిటోరియంలోనే జరిగిందని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ న్యాయనిర్ణేత స్వప్నిల్ దంగరికర్ వివరించారు.అమె మద్దతుదారులతో ఆడిటోరియం నిండిపోయినట్లు చెప్పారు.
సుధీర్ జగ్తాప్ తన డ్యాన్స్ మారథాన్‌ను మే 29ఉదయం ప్రారంభించి జూన్ 3మధ్యాహ్నం వరకు కొనసాగించింది.డ్యాన్స్ పూర్తయ్యాక అమె రోజంతా నిద్రపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.డ్యాన్స్ మారథాన్ సమయంలో జగ్తాప్ అలసిపోయిన క్షణాలు చాలా ఉన్నాయని స్వప్నిల్ చెప్పారు. కానీ ఆమె తల్లిదండ్రులు అన్ని సమయాలలో ఆమె పక్కనే ఉన్నారని, జగ్తాప్ను అప్రమత్తం చేసేందుకు ఆమె ముఖంపై నీటితో స్ప్రే చేసేవారని స్వప్నిల్ పేర్కొన్నారు.ఈ రికార్డు కోసం జగ్తాప్ దాదాపు 15నెలల పాటు కఠోరంగా శ్రమించారు. తన తాత బాబన్ మానే వద్ద ఆమె ప్రత్యేక శిక్షణ తీసుకుంది.ముఖ్యంగా తన తాత ఆమెకు యోగా నిద్రను నేర్పించారు. ఇది ఆమె ఐదు రోజులపాటు నిద్రపోకుండా ఉండేందుకు దోహపడింది.