హోప్’ పేరిట ప్రపంచ వ్యాప్తంగా TCS నిర్వహించే స్వచ్ఛంద సేవలో భాగంగా 2023 ఆర్థిక సంవత్సరంలో 2.2 మిలియన్ గంటలు TCS వాలంటీర్లు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో వాలంటీర్ల పరంగా, పనిగంటల పరంగా ప్రపంచంలోనే నెం.1 హోదాను సాధించామని TCS ప్రకటించింది. హోప్ కింద ఉద్యోగులు మొక్కల పెంపకం, ఇంధన సంరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ, రక్తదానం, రోడ్డు భద్రత, ఆహారం పంపిణీ, మానసిక ఆరోగ్యంపై అవగాహన వంటివి నిర్వహిస్తారు.