Politics

నితీశ్ సర్కార్‌కు మద్దతు ఉపసంహరణ

నితీశ్ సర్కార్‌కు మద్దతు ఉపసంహరణ

బిహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీకి చెందిన ‘హిందుస్తానీ అవామ్ మోర్చా’(హెచ్ఏఎం) పార్టీ సోమవారం రాష్ట్రంలోని నితీశ్ కుమార్ ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. ఇందుకు సంబంధించిన లేఖను అందజేసేందుకు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ అపాయింట్‌మెంట్ కోరారని పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాంఝీ కొడుకు సంతోశ్ సుమన్ తెలిపారు.కాగా, బిహార్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న సుమన్.. గతవారమే తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తమ పార్టీని అధికార జేడీయూలో విలీనం చేయాలని సీఎం నితీశ్ నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని, అందుకే మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని సుమన్ వెల్లడించారు