* మహిళను హింసించి చంపిన బంధువులు
బంగారు ఆభరణాలు దొంగిలించిందన్న అనుమానంతో 23 ఏళ్ల మహిళను స్వయంగా ఆమె బంధువులే చిత్రహింసలు పెట్టి దారుణంగా చంపేశారు. బ్లేడుతో శరీరంపై కోస్తూ, ఇనుప రాడ్లతో ఆమెను కుళ్లబొడుస్తుంటే భరించలేని ఆమె పెడుతున్న కేకలు బయటకు వినిపించకుండా పెద్దశబ్దంతో పాటలు పెట్టి జాగ్రత్తలు తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిందీ ఘటన. ఆమె చనిపోయిన తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. పక్కింటి నుంచి రెండు రోజులుగా పెద్ద శబ్దంతో మ్యూజిక్ వినిపిస్తుండడంతో అనుమానించిన ఇరుగుపొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
* సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం
ఏపిలోని బాపట్ల జిల్లాలో సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. చీరాల మండలం ఈపురుపాలెం వంతెన వద్ద రైలు పట్టా విరిగింది. ఈ విషయం గుర్తించిన గద్దె బాబు అనే చేనేత కార్మికుడు వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. దాంతో అదే ట్రాక్‌పై దానాపూర్ నుంచి బెంగుళూరు వెళ్తున్న సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలును నిలిపివేశారు. దీంతో పెను ముప్పు తప్పింది.
* రామోజీరావు, శైలజా కిరణ్‌లకు సీఐడీ నోటీసులు
మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో నిందితులుగా ఉన్న రామోజీ రావు, శైలజా కిరణ్ లకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. 41ఏ కింద నోటీసులు ఇచ్చి, జులై 5న గుంటూరులోని సీఐడీ రీజినల్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఈ కేసులో రామోజీ రావు ఏ1గా, శైలజా కిరణ్ ఏ2గా ఉన్నారు. ఈ నెల మొదటివారంలో ఏ2 శైలజా కిరణ్ ను ఆమె నివాసంలోనే సీఐడీ విచారించింది.
* ఘోరం.. కదులుతున్న రైలు నుంచి మహిళను
కదులుతున్న రైలులో ఓ మహిళపై కొందరు అత్యాచారానికి ప్రయత్నించగా, ఆమె ప్రతిఘటించింది. దీంతో రైలు నుంచి తోసేసిన ఘటన గ్వాలియర్లో జరిగింది. ఓ మహిళ(జార్ఖండ్) బంధువుతో కలిసి పనుల కోసం గుజరాత్ వెళ్లడానికి సూరత్ ఎక్స్ప్రెస్ ఎక్కింది. కొంతదూరం వెళ్లాక దుండగులు ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డారు. ప్రతిఘటించడంతో ఆమెతోపాటు బంధువును కిందికి తోసేయగా, గ్రామస్థులు రక్షించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
* కదులుతోన్న రైల్లో దారుణం
మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో దారుణం చోటుచేసుకుంది. కదులుతోన్న రైల్లో ఓ మహిళను ఐదుగురు వ్యక్తులు లైంగికంగా వేధించడమే (Sexual Assault)గాకుండా.. ఆమెను, ఆమె బంధువును బలవంతంగా బయటకు తోసేశారు. తీవ్ర గాయాలతో పట్టాల పక్కన అపస్మారక స్థితిలో పడిపోయిన వారిద్దరిని స్థానిక గ్రామస్థులు గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
* లోయలో పడ్డ కారు.. 9 మంది మృతి
ఉత్తరాఖండ్ లోని పితోర్ఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మునిషారిలో కారు లోయలో పడటంతో 9 మంది దుర్మరణం చెందారు. మరికొంతమంది గాయపడగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్సింగ్ ధామీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
* టీచర్ విద్యార్థినితో అసభ్య ప్రవర్తన
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు దారి తప్పాడు. మైనర్ అయిన ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తాను తండ్రిగా భావించే టీచర్.. తన పట్ల అలా అసభ్యంగా ప్రవర్తించేసరికి ఆ విద్యార్థిని ఒక్కసారిగా ఖంగుతింది. అతడు చేసిన పనికి ఆ అమ్మాయి స్కూలుకి వెళ్లడమే మానేసింది. చివరికి తన తల్లికి జరిగిన విషయం చెప్పడంతో.. పోలీసులు రంగంలోకి దిగి, ఈ టీచర్‌కి తగిన బుద్ధి చెప్పారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
* సనత్ నగర్‌లో దారుణం
వీధి కుక్క(stray dog)లే కాదు పెంపుడు కుక్క(pet dogs)లు సైతం దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో కుక్కలు కన్పిస్తే చాలు చిన్నలు, పెద్దలు భయాందోళనకు గురౌతున్నారు. హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్ (Sanat Nagar)లో దారుణం చోటు చేసుకుంది. సెయింట్ థెరిస్సా స్కూల్(St. Theresa’s School)లో విద్యార్థులపై కుక్క దాడికిపాల్పడింది. చిన్నారి స్కూల్ గ్రౌండ్‌లో ఆడుకుంటుండగా.. ఈ ఘటన జరిగింది. అప్రమత్తమైన విద్యార్థులు (students) టీచ్చర్లకు సమాచారం ఇచ్చారు.
* సినిమాను మించిన క్రైమ్ స్టోరీ
సినిమాల్లో కథలు గమ్మత్తుగా ఉంటాయి.. సినిమాలో చివరికి హీరోను గెలిపించడానికి డైరెక్టర్ కొత్తగా జిమ్మిక్కులు చేసి కథను సుఖాంతం చేస్తాడు.. కొన్ని సినిమా కథలు ప్రేమతో ఉంటే, మరికొన్ని పగతో రగిలే వాళ్ళు ఎలా ఉంటారు చివరికి వాళ్ల పంతాన్ని ఎలా పూర్తి చేస్తారు అనేది ఒక ప్లాన్ ప్రకారం చూపిస్తారు.. ఆ అంశం సినిమాకు హైలెట్ అవుతుంది.. అదే స్టోరీ ఇప్పుడు రియల్ లైఫ్ లో జరిగింది.. ఓ మహిళా తన కొడుకును చంపిన అందరిని వరుసగా చంపేసింది.. చివరికి పోలీసుల విచారణలో అడ్డంగా దొరికిపోయింది.. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది.
* ప్రకాశం జిల్లాలో దగ్ధమైన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు
నడిరోడ్డుపై బస్సు దగ్ధం అయిన సంఘటన ప్రకాశం జిల్లా కె.బిట్రగుంట జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బుధవారం హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి 27 మంది ప్రయాణికులతో బయలుదేరింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట సమయంలో 16వ నంబర్ జాతీయ జాతీయ రహదారిపై సాంకేతిక సమస్య తలేత్తి బస్సు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. విషయన్ని గుర్తించిన డ్రైవర్ అప్రమత్తమై రోడ్డు పక్కన బస్సును నిలిపివేసి.. ప్రయాణికులను నిద్ర నుంచి లేపాడు. ప్రయాణికులు వెంటనే బస్సులో నుంచి దిగిపోయారు. ఈ ప్రమాదంలో ప్రయాణికుల లగేజీ పూర్తిగా కాలిపోయింది,