డిజిటల్ క్రాప్ సర్వే పథకాన్ని ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తామని కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి మనోజ్ అహూజ తెలిపారు. పథకం నమూనా అమలుకు ఏపీ సహా 11 రాష్ట్రాలను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ‘ఈ సర్వే కోసం కేంద్రం రూ.47.59 కోట్లు నిధులు కేటాయించింది. రాష్ట్రప్రభుత్వం 40 శాతం నిధులను సమకూరుస్తుంది. ఈ సర్వేలో ప్రతి రైతుకు ప్రత్యేక డేటాబేస్‌ను నిర్వహించడంతో పాటు, వాళ్లకు యూనిక్ ఐడీలను ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డేటాతో యూనిఫైడ్ ఫార్మర్ సర్వీస్ ఇంటర్‌ఫేస్‌ను అందుబాటులోకి తీసుకురావాలి’ అని అహుజ పేర్కొన్నారు.