NRI-NRT

ఆ 100 వస్తువులను భారత్‌కు ఇస్తాం: అమెరికా

ఆ 100 వస్తువులను భారత్‌కు ఇస్తాం: అమెరికా

100కుపైగా పురాతన భారతీయ వస్తువులను ఇండియాకు అమెరికా తిరిగి అప్పగించనుంది. వాషింగ్టన్‌లోని రొనాల్డ్ రీగన్ సెంటర్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. భారత్ కు చెందిన ప్రాచీన వస్తువులను భారత్‌కు తిరిగి ఇచ్చేయాలన్న(100 Antiquities) అమెరికా నిర్ణయం రెండు దేశాల మధ్య ఉన్న భావోద్వేగ బంధాన్ని తెలియజేస్తోందన్నారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కు  ప్రగాఢ కృతజ్ఞతలు తెలిపారు. “నేను చివరిసారిగా అమెరికాకు వచ్చినప్పుడు కూడా  చాలా భారతీయ పురాతన వస్తువులు దేశానికి తిరిగి వచ్చాయి. నేను ప్రపంచంలో ఎక్కడ పర్యటించినా, ఆ దేశ ప్రభుత్వం భారతదేశానికి చెందిన వస్తువులను తిరిగి ఇస్తుంది. వారు నన్ను సరైన వ్యక్తిగా చూస్తారు. ఆ వస్తువులను సరైన స్థలంలో ఉంచుతాడని నమ్ముతారు. అందుకే భారతీయ పురాతన వస్తువులను మళ్ళీ  తిరిగి ఇస్తున్నారు  ”అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.