ఇప్పుడంతా స్మార్ట్ యుగం. చేతిలో స్మార్ట్ ఫోన్, ఇంట్లో స్మార్ట్ టీవీ ఉంటే సరిపోదు. చేతికి స్మార్ట్ వాచ్ కూడా ఉండి తీరాలి. అప్పుడే అప్డేటెడ్గా ఉన్నట్టు. అంతేకాదు, ‘నేను కూడా తగ్గేదేలే’ అన్నట్టు చేతి గడియారమూ అడ్వాన్స్ అవుతున్నది. ఫ్యాషన్ పాట పాడుతున్నది. అందుకే స్మార్ట్‌వాచ్ రిస్ట్ స్ట్రాప్స్, డయల్ కేస్లు.. ఇప్పుడు కొత్త ట్రెండ్. ఆడామగా.. ఇద్దరికీ నచ్చేలా ఎన్నో రంగులూ, డిజైన్లూ ఉంటున్నాయి ఇందులో.స్మార్ట్ వాచీలు మరింత స్మార్ట్‌గా కనిపించేలా హౌట్ సాస్‌లాంటి కంపెనీలు రకరకాల మోడళ్లలో వాచ్ స్ట్రాప్‌లు, డయల్ కేస్‌లను తయారు చేస్తున్నాయి. ఈ చైన్లు ఖరీదైన వాచీలను పోలి ఉండటంతో స్మార్ట్ వాచీలకు కొత్త లుక్ వస్తున్నది.
వెరైటీ ఎప్పుడూ ఫ్యాషన్‌కు నీడలా ఉంటుంది. అందుకే స్మార్ట్ వాచ్ డయల్ కేసులు, స్ట్రాప్‌లలో కూడా ఎన్నో రకాలు రూపు దిద్దుకుంటున్నాయి. లగ్జరీ వాచీల చెయిన్లను తలపించేలా బంగారం, రోజ్‌గోల్డ్, కాపర్ తదితర లోహాలతో సాదా, రాళ్లు పొదిగినవీ వస్తున్నాయి. ముత్యాల వరుసలతోనూ రూపొందిస్తున్నారు. బ్యాంగిల్ బ్రేస్లెట్ లాంటివీ, బ్యాండ్ మోడల్లో ఫ్యాషనబుల్‌గా కనిపించేవీ ఉన్నాయి. అబ్బాయిల కోసం రంగుల చారల మోడళ్లు తయారవుతున్నాయి. మొత్తానికి స్మార్ట్ వాచీలు కూడా ఇప్పుడు అలంకార వస్తువులుగా మారిపోతున్నాయన్న మాట