CME event in TANA 2023 conference to focus on mental health for healthcare professional. For more info, please see below…
తానా మహాసభలు… మెంటల్ హెల్త్ పై సెమినార్
ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో వైభవంగా నిర్వహిస్తోంది. ఈ మహాసభల సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వైద్యరంగంలో వచ్చిన మార్పులపై సిఎంఇ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మెంటల్ హెల్త్ A – Z ఫర్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అంశంపై సమావేశాలను ఏర్పాటు చేశారు.
కోవిడ్ తరువాత చాలామందిలోనూ కొనసాగుతున్న మానసిక ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అన్ని మెడికల్ స్పెషాలిటీలలో ఉన్న ఆరోగ్య సంరక్షణ నిపుణులకు ఉపయోగపడేలా అనేక రకాల అంశాలపై అజెండాను సిద్ధం చేసింది. రోగులకు అందించే చికిత్స పద్ధతులపై, వచ్చిన మార్పులపై అవగాహన కలిగించేలా నిపుణులతో ప్రసంగాలను ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు. అలాగే విభిన్న చికిత్సా విధానాలను కూడా పరిచయం చేయనున్నారు. శారీరక పరిస్థితులు, వారి ప్రవర్తన, మేధో వైకల్యాల ఉన్నవారికోసం, ఆటిజం ఉన్న వ్యక్తుల కోసం సమగ్ర సంరక్షణ వైద్య పద్ధతులను ఈ కార్యక్రమంలో చర్చించి తెలియజేయనున్నారు.
శైలజ ముసునూరి, ఎండి, లింద్‌సేవ్ బ్రౌన్, పిఎస్‌వై.డి, కృప శివమూర్తి ఎండి, డిఎన్‌బి, సిపిహెచ్, ప్రమీల మోటుపల్లి, ఎండి, టైన్‌హన్సేన్`టర్టన్, ఎంజిఎ, జెడి తదితరులు ఈ కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. ఇతర వివరాలకు తానా మహాసభల వెబ్ సైట్ ను చూడండి.