NRI-NRT

తానా కావ్య పోటీల విజేత బులుసు

తానా కావ్య పోటీల విజేత బులుసు

ప్రముఖ సినీ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి స్మారకార్థం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) సాహిత్య విభాగం “తానా ప్రపంచ సాహిత్యవేదిక” అంతర్జాతీయస్థాయిలో పద్య కావ్యాలు / గేయకావ్యాల పోటీలు నిర్వహించింది. ఈ పోటీలకు దేశ విదేశాలనుంచి 91 మంది రచయితలు పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ .. “ఈ పోటీల్లో కేవలం 11 ఏళ్ల వయసులో కుమారి అయ్యాల సోమయాజుల లక్ష్మీ అహల పాల్గొని తలపండిన పండితులు, విశేష అనుభవం ఉన్న రచయితలతో పోటీ పడడం ఆశ్చర్యం, ఆనందదాయకం. ఈ పోటీలకు వచ్చిన కావ్యాలను ముగ్గురు సాహితీ ప్రముఖులు డా. పర్వతనేని సుబ్బారావు, డా. అద్దంకి శ్రీనివాస్, తోపెల్ల బాలసుబ్రహ్మణ్యం న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి, అన్నింటినీ నిశితంగా పరిశీలించారు. అనంతరం బులుసు వెంకటేశ్వర్లు (విశాఖపట్నం) రచించిన “జీవనవాహిని” అత్యుత్తమ స్థానంలో నిలిచిన పద్యకావ్యంగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు’’ అని ప్రసాద్‌ తోటకూర ఓ ప్రకటనలో వెల్లడించారు. తానా ప్రకటించినట్టుగానే ఈ పోటీల్లో విజేతగా నిలిచిన బులుసు వెంకటేశ్వర్లుకు రూ.లక్ష నగదు పురస్కారాన్ని త్వరలోనే అందజేయనున్నట్టు డా. ప్రసాద్‌ తోటకూర తెలిపారు. ఈ పోటీల్లో రచయితలు రాసిన 91 కావ్యాలలో 50 కావ్యాలను తానా ప్రచురిస్తున్న ఈ-బుక్‌లో ప్రచురణకు ఎంపిక చేసినట్టు చెప్పారు. అనంతరం తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి మాట్లాడుతూ.. సిరివెన్నెల గారి సంస్మరణలో నిర్వహించిన ఈ ప్రత్యేక కావ్యపోటీల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న 91 మంది రచయితలకు, తానా ఈ-బుక్‌లో స్థానం పొందిన రచయితలకు, లక్ష బహుమతి గెల్చుకున్న రచయిత బులుసు వెంకటేశ్వర్లును అభినందించారు. ఎంతో సహనంతో అన్నింటినీ పరిశీలించి ఫలితాలు ప్రకటించిన న్యాయనిర్ణేతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

తానా ఈ-బుక్‌లో ప్రచురణకు ఎంపికైన ఉత్తమ పద్యకావ్యాలివే..

  • “జీవన వాహిని”- బులుసు వెంకటేశ్వర్లు
  • “సైసైరా చిన్నపరెడ్డి” – ఆచార్య ఫణీంద్ర
  • “జిగీష” – ఆముదాల మురళి
  • “పల్లె–పట్టణం” – డా. లగడపాటి సంగయ్య
  • “జననీ జన్మభూమిశ్చ” – డా. వజ్జల రంగాచార్య
  • “పృథ్వీరాజ్ చౌహాన్” – నూతలపాటి వెంకటరత్న శర్మ
  • “సామాజిక త్రిశతి” – సి. హెచ్. సూర్యనారాయణ
  • “జ్ఞానప్రబోధిని” – అన్నంరాజు ప్రభాకరరావు
  • “ఆకలి–పేదరికం” – టి. వి. ఎల్ గాయత్రి
  • “నిత్యసత్యాలు” – శ్రీనివాసరెడ్డి
  • “హృదయఘోష” – ఉపాధ్యాయుల గౌరీ శంకర్ రావు
  • “మానవసంబంధాలు” – అయ్యగారి కోదండరావు
  • “హితోపదేశం” – డా. అక్కిరాజు సుందర రామకృష్ణ
  • “నమోవాణీశతకం” – డా. కె. బాలాస్వామి
  • “వర్తమానం” – చెన్నుపాటి రామాంజనేయులు
  • “సైన్సు పద్యాలు” – ఎం. వి రామశేఖర్
  • “శ్రీలక్ష్మీనృసింహశతకం” – గోవిందు గోవర్దన్
  • “మానవ సంబంధాలు–కుటుంబ విలువలు” – నరసింహమూర్తి మల్లాది
  • “రంగుల గూడు” – రాఘవ మాస్టారు
  • “లోకావలోకనము” – ఎరుకలపూడి గోపీనాథ్ రావు
  • “దేశభక్తి” – శంకర్ జి. డబ్బికార్
  • “సిరిగీతిక” – డా. చింతలపాటి మోహన మురళీకృష్ణ
  • “కందపద్య కదంబం” – పెనుగొండ రామబ్రహ్మం
  • “కల్మషాసుర సంహారం” – సుబ్బలక్ష్మి జంధ్యాల
  • “దేశభక్తి–జాతీయవాదం” – కర్ణేన జనార్ధనరావు
  • “స్వేచ్ఛ” – అయ్యాల సోమయాజుల లక్ష్మీ అహాల
  • “దేశభక్తి–జాతీయత” – గంగాభవాని మాతా శాంకరీదేవి
  • “భూమాత కంటనీరు” – దీవి ప్రకాష్
  • “తప్తభారతం” – డా. ఎన్. వి. ఎన్ చారి

ఈ-బుక్‌లో ప్రచురణకు ఎంపికైన ఉత్తమ గేయ కావ్యాలు:

  • “మేలుకోరా! ఓ మనిషీ!” – భానుప్రకాష్ అవుసుల
  • “ఋతుగతి” – డా. వడ్డేపల్లి కృష్ణ
  • “మానవీయతాబ్ధి” – తోగాట సురేష్ బాబు
  • “పర్యావరణ భారతం” – విన్నకోట రవిశంకర్
  • “యువావతరణం” – డా. రాంభట్ల నృసింహ శర్మ
  • “పృథివి ప్రథమం” – నూజిళ్ళ శ్రీనివాస్
  • “క్రాంతివీరుడు” – తుమ్మూరి రామమోహన్
  • “వెలుగునీడల మనిషి” – జక్కు రామకృష్ణ
  • “అక్షరదీపాలు” – పెద్దాడ సాయి సూర్య సుబ్బలక్ష్మి
  • “అమృతవాహిని” – అచ్యుతానంద బ్రహ్మచారి
  • “విశ్వవిలాపం” – డా. శ్రీదేవి శ్రీకాంత్
  • “భారతజాతి భవ్యచరిత” –వి. వి. కామేశ్వరి
  • “వివాహబంధం” – దారాల విజయకుమారి
  • “నడుస్తూనే ఉండు నేస్తం” – మహేశ్ కుమార్ చదలవాడ
  • “పల్లెతల్లి” – ఎస్. నాగేంద్ర రావు
  • “రణాలతోరణమే” – డా. పెద్దాడ వెంకట లక్ష్మీ సుబ్బారావు
  • “అంతరంగ తరంగాలు” – డా. నక్తా వెంకట రాజు
  • “పదనిసలు” – డా. మురహరి ఉమా గాంధీ
  • “తెలుగు వెలుగు” – శింగులూరి హరనాథ్
  • “ప్రకృతి–పర్యావరణం” – డా. బిక్కి కృష్ణ