ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇకపై హయ్యర్ పెన్షన్‌కు నమోదు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. దీంతో ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల హయ్యర్ పెన్షన్ కల నెరవేరింది. నూతన హయ్యర్ పెన్షన్ అర్హత ప్రకారం 5-6 రెట్లు పెన్షన్ పెరగనుంది.ఈపీఎఫ్‌వో జారీ చేసిన హయ్యర్ పెన్షన్ ఆమోద పత్రాన్ని (నెలకు 25 వేలు హయ్యర్ పెన్షన్ గా నిర్ధారిస్తూ) జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జి.సత్యనారాయణకు ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు అందజేశారు. దేశంలో ఏ ఇతర ఆర్టీసీ ఉద్యోగులకు లేని అవకాశం ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు లభించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.