వరల్డ్ కప్ టీమ్ సెలెక్షన్ టైమ్‌లో నాలుగో నంబర్ కోసం అంబటి రాయుడు, విజయ్ శంకర్ మధ్య తీవ్ర పోటీ నడిచింది. సీనియర్, స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ అయిన రాయుడిని కాదని.. ఆల్‌రౌండర్ శంకర్‌ను సెలెక్ట్ చేయడంపై విమర్శలు వచ్చాయి. పైగా, మెగా టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ శంకర్ బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. అయినా.. కెప్టెన్ కోహ్లీ అతనికి బహిరంగంగానే మద్దతు పలికాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో కూడా అతను తుది జట్టులో ఉంటాడని చెప్పాడు. కానీ, గాయం తిరగబెట్టడంతో శంకర్ టోర్నీ నుంచి అర్ధంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. నాలుగో నంబర్ కోసం వచ్చిన విజయ్ వైదొలగడంతో ఆ ప్లేస్ కోసం పోటీ పడిన తనను జట్టులోకి తీసుకుంటారని ఆశిస్తే రాయుడుకు మళ్లీ నిరాశే ఎదురైంది.స్టాండ్ బై లిస్ట్‌లో ఉన్న రాయుడును కాదని, వన్డే అనుభవమే లేని మయాంక్‌కు చాన్స్ ఇవ్వడాన్ని అతని ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. తెలుగు క్రికెటర్‌పై వివక్ష చూపుతున్నారని విమర్శిస్తున్నారు. ప్రపంచకప్ టీమ్ ప్రకటించిన తర్వాత చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌ను ఎద్దేవా చేస్తూ ‘3డి గ్లాసెస్ కొన్నా’అని కామెంట్ చేయడం వల్లే రాయుడును మళ్లీ పక్కనబెట్టారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
నోటిదూలతో అవకాశం పోగొట్టుకున్నాడు
Related tags :