నదిలో ప్రవహించే నీరు ఒక్కసారిగా రక్తం మాదిరిగా ముదురు ఎరుపు రంగులోకి మారడంతో జపాన్‌లోని నాగో నగర ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఒరియాన్ బీర్ ఫ్యాక్టరీకి చెందిన కూలింగ్ వ్యవస్థల్లో ఒక దానిలో ఏర్పడిన లీకేజీయే దీనికి కారణమని తెలుస్తోంది. ఆహార పదార్థాల్లో ఉపయోగించే రంగు పొరపాటున లీకైంది. అది నదిలోకి విడుదల కావడంతో నీరంతా ముదురు ఎరుపు రంగులోకి మారిపోయింది. మంగళవారం ఈ లీక్ మొదలైనట్లు, మరమ్మతుల అనంతరం ఇది ఆగిపోయినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.