విశాఖ ఉక్కు కర్మాగారంలో ఏడాదిలో సుమారు వెయ్యి మంది ఉద్యోగులు తగ్గిపోయారు. 2021 డిసెంబరు 31 నాటికి 15,928 మంది పనిచేస్తుండగా, 2022 డిసెంబర్ 31 నాటికి ఆ సంఖ్య 14,935కి పడిపోయింది. కేంద్ర ఉక్కుశాఖ వార్షిక నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.2021 మార్చి 31 నుంచి డిసెంబరు 31 మధ్యకాలంలో దీని నెట్వర్త్ రూ.2,464 కోట్ల నుంచి రూ.3,240 కోట్లకు పెరగ్గా, 2022లో ఇదే సమయంలో రూ.3,175 కోట్ల నుంచి రూ.479 కోట్లకు పడిపోయింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో రూ.15,618 కోట్ల వ్యాపారం చేసిన ఈ సంస్థ 2022లో రూ.2,751.34 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. 2021 ఏప్రిల్ – డిసెంబర్ మధ్యకాలంలో రూ.19,401 కోట్ల వ్యాపారం చేసి రూ.790 కోట్ల నికర లాభాన్ని సాధించగా, 2022లో నష్టాల బారిన పడింది.
గత రెండేళ్లలో సంస్థ పనితీరులో వచ్చిన మార్పులు (వేల టన్నుల్లో)
ఉత్పత్తి 2021 2022
హాట్ మెటల్ 6,061 4,452
పిగ్ ఐరన్ 91 42
ఫినిష్డ్ స్టీల్ 3,384 3,464