* ఆటో బోల్తా పడి ఆరుగురికి గాయాలు, ఒకరి మృతి
ఆటో అదుపుతప్పి ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలైన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మేడ్చల్ మండలంలోని రావల్ కోల్ గ్రామం చెరువు మలుపు వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది.
* కదులుతున్న వందేభారత్ రైలు ఎక్కేందుకు యత్నించిన టీసీ
గుజరాత్‌లోని అహ్మదాబాద్ రైల్వేస్టేషన్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కదులుతున్న వందేభారత్ ట్రైన్ ఎక్కబోయిన టీసీ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే అహ్మదాబాద్ నుంచి ముంబయి వెళ్తున్న వందేభారత్ ట్రైన్ ప్లాట్‌ఫాం నుంచి కదులుతోంది. ఆ సమయానికి ఆ రైల్లో విధులు నిర్వహించాల్సిన టీసీ పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ అప్పటికే ఆ ట్రైన్ తలుపులు పాక్షికంగా ముసుకుపోయాయి. రైలు వేగం పుంజుకుంటోంది. ఈ క్రమంలోనే ఆ టీసీ ఎలాగైనా ట్రైన్ ఎక్కాలని భావించాడు. రైలు ఆపాలని క్యాబిన్‌లో ఉన్న లోకో పైలట్ సైగలు చేశాడు. అలానే రైలు వెంట పరిగెత్తాడు.సగం మూసుకుపోయిన తలుపుల ద్వారా లోపలికి ఎక్కేందుకు యత్నించి విఫలమయ్యాడు. మరో విషయం ఏంటంటే ఆ ఫ్లాట్‌ఫాం తడిగా ఉంది. దీంతో అతను అదుపుతప్పి కిందపడిపోయాడు. అయితే చుట్టుపక్కల ఉన్నవారు వెంటనే అప్రమత్తమయ్యారు. అతడ్ని పక్కకు లాగారు. ఒకవేళ అతడు రైలుకు, పట్టాల మధ్య ఇరుక్కుపోయినట్లైతే ప్రాణాలకే ప్రమాదం ఉండేది. జూన్ 26 న ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటీజన్లు తమ భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
* ఐఆర్‌ఎస్ అధికారి ఇంట్లో చోరీ కేసు
హైదరాబాద్లో రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి శామ్యూల్ ప్రసాద్ ఇంట్లో జరిగిన భారీ చోరీ కలకలం సృష్టిస్తోంది. ఈ కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. ఎస్సై కృష్ణను అదపులోకి తీసుకోనిలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ చోరీ కేసులో ఎస్సై కృష్ణ సూత్రదారిగా అధికారులు గుర్తించారు. సురేందర్ ను విచారించడంతో వెలుగులోకి ఎస్సై కృష్ణ వ్యవహారం వచ్చింది. సురేందర్ అనే వ్యక్తితో కలిసి 100 కోట్ల ఆస్థి కొట్టేసేందుకు ఎస్సై కృష్ణ స్కెచ్ వేసినట్లు తెలుస్తుంది.
* బస్టాప్‌లో వేచిఉన్నవారిపైకి దూసుకెళ్లిన లారీ
పశ్చిమ కెన్యాలోని లోండియానిలో ఉన్న రిఫ్ట్ వ్యాలీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కెరిచో-నకురు మధ్య హైవేపై బస్‌స్టాప్‌లో వేచిఉన్నవారితోపాటు చిరు వ్యాపారులపైకి ఓ లారీ (Lorry) దూసుకెళ్లింది. దీంతో 48 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 30 మందికి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, సంబంధిత విభాగాల అధికారులు సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.ధ్వంసమైన వాహన శకలాల కింద మరికొంత మంది చిక్కుకొని ఉన్నారని పోలీసులు తెలిపారు. వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యల్లో అంతరాయం కలిందన్నారు. కాగా, ప్రమాద ఘటనపై కెన్యా అధ్యక్షుడు విలియం రూటో దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు చేపడటామని రవాణా మంత్రి కిప్‌చుంబా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
* అడ్వెంచర్ చేద్దామని వెళ్లి పై నుంచి కింద పడ్డ బాలుడు
ఆరేళ్ల బాలుడు 40 అడుగుల ఎత్తులో ఉన్న జిప్‌లైన్ నుంచి కిందకు పడిపోయాడు (Boy Falls Off Zipline). అయితే ఆశ్చర్యకరంగా ప్రాణాలతో బయటపడ్డాడు. గుండె జలదరించేలా ఉన్న ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మెక్సికోలోని మోంటెర్రీలో ఈ సంఘటన జరిగింది. జూన్ 25న అమ్యూజ్‌మెంట్ పార్క్‌లోని ఫండిడోరా అమెజోనియన్ ఎక్స్‌పెడిషన్‌లో ఆరేళ్ల సీజర్ పాల్గొన్నాడు. 40 అడుగుల ఎత్తులో ఉన్న జిప్‌లైన్ నుంచి వేలాడుతూ వెళ్లసాగాడు. ఒక ట్రైనర్ కూడా ఆ బాలుడి చెంతనే ఉన్నాడు. అయితే ఉన్నట్టుండి బాలుడు ధరించిన సేఫ్టీ బెల్ట్ ఊడిపోయింది. దీంతో ఒక్కసారిగా 40 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయాడు. ఇది చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.
* మడిపల్లిలో దారుణం
అప్పుల బాధ తాళలేక ఓ కౌలు రైతు గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన పంజాల అశోక్ (40) అనే రైతు తనకు ఉన్న ఎకరం భూమితో పాటు మరో మూడెకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని పంటలు సాగు చేశాడు. పంట దిగుబడి కోసం రూ.6 లక్షల అప్పు చేశాడు. పంట దిగుబడి సరిగా రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అశోక్ శుక్రవారం రాత్రి మడిపల్లి గ్రామ శివారులోని 18వ రైల్వే గేటు సమీపంలో గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య అరుణ, ఇద్దరు కుమారులు ఉన్నారు.
* మహారాష్ట్రలో బస్సులో చెలరేగిన మంటలు
మహారాష్ట్రలో ఓ బస్సులో మంటలు చెలరేగి 25 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో ఎనిమిదిమంది తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. 32 మంది ప్రయాణికులతో యావత్మాల్ నుంచి పూణె వెళ్తున్న బస్సు బుల్దానాలోని సమృద్ధి మహామార్గ్ ఎక్స్‌ప్రెస్ వేపై వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.ఈ తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో జరిగిందీ ఘటన. మంటల ధాటికి బస్సు పూర్తిగా కాలిబూడిదైంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను బుల్దానా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
* ఈతకొడుతూ రాళ్ల మధ్య ఇరుక్కుపోయిన యువకుడు
తిరుపతి జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన తలకోన జలపాతంలో ఈత కొడుతూ ఓ యువకుడు ప్రమాదవశాత్తు బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని రక్షించే ప్రయత్నం చేసినా వీలుకాకపోవడం, చీకటి పడడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. దీంతో ఈ ఉదయం తీస్తామని చెప్పారు.రాళ్ల మధ్య ఇరుక్కున్న యువకుడిని కర్ణాటకలోని మంగళూరుకు చెందిన సుమన్ (23)గా గుర్తించారు. విహారయాత్ర కోసం స్నేహితులతో కలిసి వచ్చాడు. నిన్న జలపాతంలోకి దిగి ఈత కొడుతుండగా రాళ్ల మధ్య ఇరుక్కుపోయాడు.
* ట్రక్కు భీభత్సం.. 48 మంది మృతి
కెన్యాలో ట్రక్కు భీభత్సం సృష్టించింది. నిన్న సాయంత్రం రద్దీ జంక్షన్లో ట్రక్కు అదుపు తప్పి పాదచారులవైపు దూసుకెళ్లిన ఘటనలో 48 మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. కెరిచో వైపు వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి 8 వాహనాలను, బైకులను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు.ఈ ఘటనపై కెన్యా అధ్యక్షుడు విలియం విచారం వ్యక్తం చేశారు.
* భార్యను కాల్చేసి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు
భార్య భర్తల మధ్య గొడవ వారిద్దరి ప్రాణాలు తీసింది. పెళ్లై 5 నెలలైనా కాలేదు, అప్పుడే ఆ దంపతుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో భర్త, భార్యను కాల్చి చంపేసి, ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్ జిల్లా మఖ్యాలి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది