* ఆలయంలో చోరీకి విఫలయత్నం
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఆరుళ్ల గ్రామంలో ఆలయంలోనే దొంగతనం చేసేందుకు దుండగులు తెగబడ్డారు. ఆరుళ్ల గ్రామంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆలయంలో చోరీకి యత్నించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
* చెరువులో దూకి పిల్లలు సహా తల్లి ఆత్మహత్య
శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ముదిగుబ్బ మండల కేంద్రం నుంచి గుడ్డంపల్లి తండాకు వెళ్లే మార్గంలో జరిగింది. చెరువుకట్ట పైనుంచి పిల్లలతో పాటు దూకి మహిళ బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న ముదిగుబ్బ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. చెరువులో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు
* నెల్లూరు నారాయణలో మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య
రో వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హౌస్ సర్జన్ చేస్తోన్న ఆమె ఉన్నట్టుండి హాస్టల్ గదిలో బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లాలోని నారాయణ మెడికల్ కాలేజీలో ఆదివారం (జులై 2) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన చైతన్య (23) అనే వైద్య విద్యార్థినికి రెండు నెలల క్రితం వివాహం జరిగింది. ఆమె నెల్లూరులోని చింతారెడ్డిపాలెంలో ఉన్న నారాయణ మెడికల్ కాలేజీలో చదువుతోంది. హాస్టల్లో ఉంటూ హౌస్ సర్జన్ చేస్తోన్న ఆమె ఆదివారం ఉదయం తన హాస్టల్ గదిలోనే ఆత్మహత్యకు పాల్పడింది.
* బ్రిడ్జి పైనుంచి రైల్వేట్రాక్‌పై పడిన కారు
50 అడుగుల ఎత్తు నుంచి రైల్వే ట్రాక్‌పై పడ్డ కారు మహారాష్ట్ర నాగపుర్ ఇంగన్‌ఘాట్ మార్గంలోప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్‌పై వెళ్తున్న కారు అదుపుతప్పి బోతిబోరి-బోర్కేడ్ స్టేషన్ల మధ్య ఉన్న రైల్వే ట్రాక్‌పై పడింది. 50 అడుగుల ఎత్తుపై నుంచి పడటంతో కారులోని నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో రైలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
* మణిపూర్ లో ఆగని హింస
కాల్చివేత భారీగా బలగాలను మోహరించినా మణిపూర్‌లో అల్లర్లు అదుపులోకి రావడం లేదు. ఏదో ప్రాంతంలో హింస చెలరేగుతూనే ఉంది. నిన్న అర్ధరాత్రి కుంబీ నియోజకవర్గంలో ‘కుజూమా’ గ్రామంలో మైతేయ్ వర్గానికి చెందిన ముగ్గురిని కుకీ మిలిటెంట్లు కాల్చి చంపారు. దీంతో ఆగ్రహానికి గురైన మైతేయ్ు ‘డంప్కీ కుకీ’ గ్రామాన్ని దహనం చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా బలగాలను అక్కడకు తరలించారు.
* ఆర్టీసీ బస్సు ఢీకొని ఐటీ ఉద్యోగి మృతి
పిల్లలతో కలిసి బయటికెళ్దాం! పది నిమిషాల్లో ఇంటికొస్తున్నా’’ అని తన భార్యకు చెప్పాడు భర్త. మరి కొద్దిసేపట్లో బయటికెళ్లి ఆనందంగా గడుపుతామని భావించిన ఆ కుటుంబాన్ని ఆర్టీసీ బస్సు ప్రమాదం విషాదంలో ముంచెత్తింది. భర్త వెళ్తున్న బైక్‌ను బస్సు ఢీకొట్టడంతో ఆయన చనిపోయాడు. కుషాయిగూడ పీఎస్ పరిధిలోని ఏఎస్రావు నగర్ మెయిన్ రోడ్డులో శుక్రవారం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మృతుడిని కొడిమెళ్ల కిరణ్‌కుమార్(30)గా గుర్తించారు. సైనిక్‌పురిలో నివాసం ఉంటున్న కిరణ్ కుమార్‌కు భార్య అశ్విని, పిల్లలు విఘ్నేష్ (2), రిత్విక్ (ఐదు నెలలు) ఉన్నారు. కిరణ్ పోచారంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు.
* తొలిప్రేమ’ రీరిలీజ్.. సినిమాహాల్లో తెరను చించేసిన అల్లరి మూక
విజయవాడలో తొలిప్రేమ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్లో బీభత్సం సృష్టించిన ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రి కపర్థి థియేటర్లో కొందరు.. సిబ్బందిపై దాడి చేసి, స్క్రీన్ చించేశారు. కిటికీలు, అద్దాలు, కుర్చీలు ధ్వంసం చేశారు. రూ.4 లక్షల మేర నష్టం జరిగిందని యజమాని తెలిపారు. అయితే వైసీపీ కార్యకర్తలే విధ్వంసం సృష్టించారని జనసేన అధికార ప్రతినిధి వెంకటమహేశ్ ఆరోపించారు
* కొడుకుతో సహా చెరువులో దూకి తండ్రి ఆత్మహత్య
మానసిక వ్యాధితో బాధ పడుతున్న ఓ ప్రైవేట్టీచర్తన కొడుకుతో సహా చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం..హనుమకొండ కనుకదుర్గ కాలనీకి చెందిన శీలమంతుల రవీందర్(38) నగరంలోని ఓ ప్రైవేటు స్కూల్లో మ్యాథ్స్ టీచర్. ఈయనకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు శ్రీచరణ్(8) అదే స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్నాడు. రవీందర్ దాదాపు రెండేండ్ల నుంచి మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు.
* రిటైర్డ్ ఐఆర్ఎస్ శాముల్ ప్రసాద్ ఇంట్లో చోరీ కేసులో రోజుకో మలుపు
రిటైర్డ్ ఐఆర్ఎస్ శాముల్ ప్రసాద్ ఇంట్లో చోరీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. శ్యాముల్ ఆస్తి పత్రాల చోరీకి స్కెచ్ వేసిన ఎస్ఐ కృష్ణకు మరో నలుగురు సహకరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడి అయింది. వారిలో ఇద్దరు వ్యక్తులను ముషీరాబాద్ పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నట్లు సమాచారం. మరో ఇద్దరి పాత్రపై ఆరా పోలీసులు తీస్తున్నారు.ఇప్పటికే ఈ కేసులో సురేందర్ ను పోలీసులు విచారించి కీలక వివరాలు సేకరించారు. ఎస్ఐ కృష్ణకు రంగారెడ్డి జిల్లా పాత నేరస్తుడు శ్రీశైలంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆశీర్వాదం సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఇద్దరు వ్యక్తులను ప్రస్తుతం విచారిస్తున్నట్లు సమాచారం.నార్సింగ్ లో ఓ అపార్ట్ మెంట్ నిర్మాణం చేస్తున్నప్పుడు శ్యామలతో ఆశీర్వాదంకు పరిచయం ఏర్పడింది.
* ఒడిశా దుర్ఘటన జరిగి ఇవాళికి నెల
దేశ చరిత్రలో అత్యంత ఘోర ప్రమాదంగా నిలిచిన ఒడిశా రైలు ప్రమాదం జరిగి నేటికి నెల. జూన్ 2న సాయంత్రం బహనాగ స్టేషన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును కోరమండల్ ఎక్స్‌ప్రెస్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. అదే సమయంలో పక్క నుంచి వెళ్తున్న యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌కు కోరమండల్ బోగీలు తాకి రెండు రైళ్లకు చెందిన సుమారు 12 బోగీలు గాల్లోకి ఎగిరి కిందపడ్డాయి. ఈ ప్రమాదంలో 291 మంది మరణించారు. వేలమంది గాయపడ్డారు.