మన ఊరు మన వాళ్ళు అన్న స్ఫూర్తితో అమెరికాలోని ప్రవాస ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం లోని చలప్పాలెం గ్రామస్తులు అందరూ జూన్ 23 మరియ 24 తేదీలలో న్యూజెర్సీ రాష్ట్రంలోని ప్రిన్స్ టన్ పట్టణం లో కలిశారు. దీనికి అమెరికా లోని పలు రాష్ట్రాలలో నివసిస్తున్న చలప్పాలెం గ్రామ సభ్యులు తమ కుటుంబాలతో తరలి వచ్చారు. ఈ సమావేశంలో తమ పిల్లలకు తమ గ్రామ మూలాలను తెలియ చేయవలసిన అవసరాన్ని, తమ గ్రామ ప్రవాసులందరు కలసి తమ గ్రామానికి ప్రస్తుత మరియు భవిష్యత్తులో అవసరమైన సహాయం చేయడానికి, తమ ఉన్నతికి కారణమైన తల్లిదండ్రులను మరియు పెద్దలను స్మరించుకోవడానికి, అమెరికాలో ఒకరికొకరు అండదండలతో కలసి మెలసి ఉండాలని ఈ సమావేశ నిర్వహణ ప్రధాన ఉద్దేశం అని సమావేశాన్ని నిర్వహించిన ఈ గ్రామ సభ్యులు తెలిపారు. కొణిదెల చంద్రశేఖర్, ఉమ్మలనేని రవి, కొణిదెల సతీష్, కొత్తపల్లి కవిత, పరిటాల కల్పన, కరిచేటి నారాయణ, రావిపాటి వంశీ, బైరపునేని నవ్య, గుండవరపు రాజేష్, రాయపునేని శేషమ్మ, కరిచేటి వెంకటేశ్వర్లు, మాదాల అంజి, పోతినేని రఘు, మన్నం పవన్, కొణిదెల నవీన్, ఉమ్మలనేని రాజేష్, రావిపాటి సాగర్, చుంచు భార్గవ్, ఉమ్మలనేని రమేష్, మాదాల ఫణీంద్ర, మన్నం రవితేజ, అడుసుమల్లి నిషాంత్, వడ్డే వినయ్ మరియు తదితరుల కుటుంబాలు ఈ సమావేశానికి విచ్చేశారు