NRI-NRT

ప్రవాస భారతీయులతో సమావేశం కానున్న వెంకయ్య

Washington DC Indian Community Reception To Venkayya Naidu

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ ప్రాంత ప్రవాస భారతీయ సమాజం 10వ తేదీ సోమవారం నాడు భారత మాజీ ఉప-రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వర్జీనియాలోని ఛాంటిలీలో బెల్లెవ్యూ కాన్ఫరెన్స్ సెంటరులో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధు హాజరు అవుతారని నిర్వాహకులు తెలిపారు.