DailyDose

నోట్ల మార్పిడి కేసులో స్వర్ణలత అరెస్ట్-TNI నేటి నేర వార్తలు.

నోట్ల మార్పిడి కేసులో స్వర్ణలత అరెస్ట్-TNI నేటి నేర వార్తలు.

కశ్మీర్ లో కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి

జమ్ముకశ్మీర్ లో కురుస్తున్న భారీ వర్షాలకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గవారి గండోప్ – జమ్ము మార్గంలో వర్షాలు కారణంగా ఓ బస్సుపై కొండ చరియలు విరిగిపడ్డాయి. పైనుంచి జారి వచ్చిన బురద ఢీకొట్టగా బస్సు రోడ్డు పక్కనున్న గోతిలో పడిపోయింది. బస్సులో ఉన్న నలుగురు వ్యక్తులు బురదలో చిక్కుకోగా ఇద్దరిని పోలీసులు రక్షించారు. మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గండోహ్ జిల్లాలోని భాంగ్రూ పట్టణం సమీపంలో ఈ ఘటన జరిగింది.

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం శ్రీనివాస్‌నగర్‌ వద్ద ప్రమాదం జరిగింది. జాతీయరహదారిపై ఆగిఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి చెందగా.. 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మార్కాపురం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించిన ఇద్దరిని ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు కాకినాడ నుంచి కర్నూలు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది

* ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ప్రకాశం జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా వెళ్లి ఆగివున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందగా.. 20 మందికి పైగా ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.కాకినాడ నుండి కర్నూల్‌కు వెళుతున్న ఆర్టీసీ బస్సు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం శ్రీనివాస్ నగర్ సమీపంలో ఓ లారీని ఢీ కొట్టింది. బస్సు అదుతప్పి రోడ్డుపక్కన ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ రెండు వాహనాల మధ్య ఇరుక్కుపోయి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. బస్సులో ప్రయాణిస్తు్న్న 20 మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు. జేసీపీ సాయంతో బస్సులో ఇరుక్కుపోయిన డ్రైవర్ మృత దేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

దళితుడితో చెప్పులు నాకించిన వ్యక్తి

దేశంలో దళితులు, గిరిజనులపై తరుచూ ఏదో ఒక చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఓ దళితుడితో ఓ వ్యక్తి చెప్పులు నాకించిన ఘటనకు సంబంధించిన వీడియో ఇటీవల వైరల్ (Video Viral) అయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని సోన్‌భద్ర జిల్లాలో చోటుచేసుకుంది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఆదివారం నిందితుడిని అరెస్టు చేశారు.

నోట్ల మార్పిడి కేసులో స్వర్ణలత అరెస్ట్

నోట్ల మార్పిడి కేసులో నిందితురాలు విశాఖ మహిళా సీఐ | స్వర్ణలతకు పోలీసు శాఖ షాక్ ఇచ్చింది. ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెతోపాటు కానిస్టేబుల్ హేమసుందర్ పైనా వేటు వేసింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఇద్దరినీ సస్పెండ్ చేసినట్లు సీపీ తెలిపారు. కాగా రూ.2000 నోట్ల మార్పిడి కేసులో స్వర్ణలత ఏ4గా ఉన్నారు.

* వ్యాన్‌లో గ్యాస్‌ సిలిండర్ పేలి ఏడుగురు సజీవ దహనం!

పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో శనివారం (జులై 8) ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం ఏడుగురు సజీవదహనమయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్గోధా జిల్లాలో ప్యాసింజర్లతో వెళుతున్న ఓ వ్యాన్‌లో అమర్చి ఉన్న లిక్విఫైడ్​ పెట్రోలియం సిలిండర్ నుంచి గ్యాస్ లీక్​అయ్యి ఒక్కసారిగా పేలింది. దీంతో వాహనంలో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మహిళలు ఉన్నారు. అందులో ముగ్గురి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డరు. సిలిండర్ పేలిన వెంటనే వ్యాన్‌కు మంటలు అంటుకున్నాయి. గాయపడిన వారిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటనపై పంజాబ్ తాత్కాలిక సీఎం మొహ్సిన్ నఖ్వీ దర్యాప్తుకు ఆదేశించారు.

దిల్లీ ఐఐటీలో విషాదం

దేశవ్యాప్తంగా ఐఐటీ ల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యల ఘటనలు కలకలం రేకెత్తిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఐఐటీ మద్రాస్‌ లో నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా.. తాజాగా ఐఐటీ దిల్లీ లో ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉత్తర్‌ప్రదేశ్‌ లోని బరేలీ కి చెందిన ఆయుష్‌ అనే విద్యార్థి ఐఐటీ దిల్లీలో బీటెక్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. శనివారం రాత్రి  ఆ విద్యార్థి క్యాంపస్‌లోని ఉదయగిరి హాస్టల్‌లోని తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

 శ్రీకాళహస్తిలో ఘోర ప్రమాదం

శ్రీకాళహస్తిలో విషాద ఘటన చోటుచేసుకుంది. లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇక, మృతులు విజయవాడకు చెందినట్టు సమాచారం. వివరాల ప్రకారం.. శ్రీకాళహస్తి సమీపంలోని మెట్ట కండ్రిగ వద్దలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న లారీని హైస్పీడ్‌లో ఉన్న కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందగా, మరో ఇద్దరు త్రీవంగా గాయపడ్డారు. ఇక, ప్రమాదం జరిగిన సమయంలో కారులో 8 మంది ప్రయాణిస్తున్నారు. కాగా, వీరంతా తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కాగా, ప్రమాదంలో గాయపడిన వారిని అంబులెన్స్‌లో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. 

సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ లో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతూనేవున్నాయి. ఒక ఘటన మరువకముందే మరో ఘటన చోటు చేసుకుంటుంది. తాజాగా సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున పాలికాబజార్ లోని ఓ బట్టల షాప్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.క్రమంగా మంటలు షాప్ మొత్తానికి విస్తరించడటంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఓ ఆయుర్వేదిక్ దుకాణం నుంచి మంటలు వ్యాపించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇంకా పిల్లల్ని కనరా అన్నందుకు పక్కింటి వాళ్లను కొట్టి చంపాడు

పంజాబ్ లూథియానాకు చెందిన మున్నాకు పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టలేదు. పక్కింట్లో ఉండే సురిందర్ కౌర్ ‘పిల్లల్ని ఎప్పుడు కంటారు. వైద్యులకు చూపించుకో’ అని మున్నాను విసిగిస్తూ ఉండేది. తాజాగా తన భార్య ముందే మరోసారి అలా అనడంతో కోపంతో ఆమెతోపాటు భర్త చమన్లాల్, అత్త మున్నాకౌరు సుత్తితో కొట్టి చంపేశాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేయగా తన భార్య ఒంటరి అవుతుందని, ఆమెనూ అరెస్ట్ చేయాలని కోరాడు.