ఏపీ ప్రజలకు శుభవార్త…. రేషన్ కార్డులు ఉన్నవారికి రాగులు, జొన్నలు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం త్వరలోనే కొర్రల పంపిణీకి సిద్ధమవుతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొర్రలు పండించే రైతుల నుంచి కొనుగోలు చేసి… తిరిగి ప్రజలకు సరాఫరా చేయనుంది.కొర్రలు పండించే రైతులకు అండగా ఉండేలా… మద్దతు ధర కల్పించాలని కేంద్రాన్ని ప్రభుత్వం కోరింది. ప్రస్తుతం పట్టణాల్లో పంపిణీ చేస్తున్న గోధుమపిండిని గ్రామాల్లోనూ పంపిణీ చేసేందుకు సర్వే చేపట్టింది.