NRI-NRT

ప్రిగోజిన్ పుతిన్‌తో సమావేశమయ్యారు

ప్రిగోజిన్ పుతిన్‌తో సమావేశమయ్యారు

వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ (Wagner Group Chief Yevgeny Prigozhin) రష్యాపై సంయుక్త తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఒక్కరోజు తర్వాత బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో మధ్యవర్తిత్వం వహించడంతో తిరుగుబాటును విరమించుకున్నారు. అయితే తిరుగుబాటు ప్రకటించిన ఐదు రోజుల తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో  ప్రిగోజిన్ సమావేశమయ్యారు. ప్రిగోజిన్‌తో పాటు వాగ్నర్ గ్రూప్ కమాండర్లు కూడా కొందరు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జూన్ 29న మాస్కోలో ఈ సమావేశం జరిగింది. ఈ విషయాన్ని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ సోమవారం వెల్లడించారు.దాదాపు మూడు గంటల పాటు సమావేశం జరిగినట్లు దిమిత్రి పేర్కొన్నారు. ఇక ఈ సమావేశంలో ఉక్రెయిన్‌ యుద్ధభూమిలో వాగ్నర్ గ్రూప్ చర్యల గురించి ప్రధానంగా చర్చించారని వెల్లడించారు. అలాగే ప్రిగోజిన్ తిరుగుబాటు ప్రకటించిన రోజు నాటి సంఘటనల గురించి చిర్చించారని పేర్కొన్నారు. అలాగే పుతిన్ యుద్ధంలో భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి వాగ్నర్ గ్రూప్‌కు పలు సూచనలు చేసినట్లు వివరించారు. సంయుక్త తిరుగుబాటుకు దారి తీసిన పరిస్థితులను వాగ్నర్ గ్రూప్ కమాండర్లు పుతిన్‌కు వివరించారని వెల్లడించారు.