Devotional

ఈ రాశివారు ఈ రోజు ప్రయాణాల్లో జాగ్రత్తగా

ఈ రాశివారు ఈ రోజు ప్రయాణాల్లో జాగ్రత్తగా

🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
✍🏻 11.07.2023 ✍🏻
🗓 నేటి రాశి ఫలాలు 🗓

🐐 మేషం
ఈరోజు (11-07-2023)

రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. అనుకోని ఖర్చులు మీద పడడానికి అవకాశం ఉంది. ముఖ్యమైన పనుల్ని వేగంగా పూర్తి చేస్తారు. పెండింగ్ పనుల నుంచి బయటపడతారు. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఉద్యోగంలో స్థాన చలనానికి కూడా అవకాశం ఉంది. వ్యాపారాలలో అప్రయత్న ధన లాభం ఉంది. ఇతరుల విషయాలలో తలదూర్చకపోవడం మంచిది. కొత్త ఉద్యోగావకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
ఈరోజు (11-07-2023)

ఆస్తికి సంబంధించిన వివాదాలు, వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల ఆర్థిక ప్రయోజనాలుంటాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ, ప్రోత్సాహాలతో పదోన్నతికి అవకాశం ఉంది. ముఖ్యమైన పనుల్లో సొంత ఆలోచనల వల్ల ఉపయోగం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో సఖ్యత మరింతగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో సంపాదన నిలకడగా ముందుకు సాగుతుంది. కొన్ని ప్రధానమైన పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
ఈరోజు (11-07-2023)

వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగపరంగా శుభవార్తలు వినడం జరుగుతుంది. జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహించి గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో సకాలంలో బాధ్యతలు నిర్వహిస్తారు. పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆరోగ్యం పరవాలేదు.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
ఈరోజు (11-07-2023)

ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. శత్రుపరమైన సమస్యల నుంచి బయటపడతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. తలపెట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ఇంట్లో శుభ కార్యం చేసే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. వ్యాపారం ఆశాజనకంగా ముందుకు సాగుతుంది. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ సభ్యులను సంప్రదించడం వల్ల ప్రయోజనం పొందుతారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
ఈరోజు (11-07-2023)

ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వహించవలసి రావచ్చు. అధికారులతో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ వాతావరణం సామాన్యంగా సాగిపోతుంది. పిల్లల చదువులు, ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులు చిన్న ఉద్యోగంతో సంతృప్తి చెందాల్సి వస్తుంది. ఆదాయం బాగానే ఉంటుంది. ఖర్చులు బాగా తగ్గించుకుంటారు. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండడం మంచిది. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వ్యాపారాల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఆరోగ్యం చాలావరకు పరవాలేదు.
🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
ఈరోజు (11-07-2023)

ప్రయాణాల వల్ల ఆర్థికంగా లబ్ధి పొందుతారు. విలువైన వస్తువులు కొంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితుల సహాయం అందుతుంది. ఆర్థికపరంగా కొద్దిగా సమస్యలున్నప్పటికీ, విలాస జీవితం అనుభవిస్తారు. ఆస్తికి సంబంధించిన వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఉద్యోగంలో సకాలంలో లక్ష్యాలు, బాధ్యతలు పూర్తి చేస్తారు. వృత్తి జీవితంలో ఉన్నవారికి తీరిక దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో లాభాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కాస్తంత ఆందోళన కలిగించవచ్చు.
💃💃💃💃💃💃💃

⚖ తుల
ఈరోజు (11-07-2023)

చిన్ననాటి మిత్రులతో ఎక్కువ సమయం గడుపుతారు. ఆర్థికపరంగా అనుకూల వాతావరణం నెలకొంటుంది. ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఒకటి రెండు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు ఎటువంటి ఆటంకాలూ లేకుండా పూర్తవుతాయి. ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాలు సజావుగా, సాఫీగా సాగిపోతాయి. అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్ర చేయాలనే సంకల్పం కలుగుతుంది.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
ఈరోజు (11-07-2023)

ఆదాయ మార్గాలు అనుకూలమై, ఆర్థికంగా కొద్దిగా నిలదొక్కుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో పైకి ఎదగే సూచనలున్నాయి. అధికారుల నుంచి అనేక విధాలుగా సహాయం అందుతుంది. ప్రయాణాల విషయంలోనూ, ఆరోగ్యం విషయంలోనూ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కొత్త ప్రయత్నాలు, కొత్త నిర్ణయాల వల్ల ప్రయోజనం ఉంటుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి మంచి కబుర్లు వింటారు.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
ఈరోజు (11-07-2023)

ఉద్యోగ సంబంధంగా ఏ ప్రయత్నం తలపెట్టినా అది సఫలం అవుతుంది. ప్రయాణాల వల్ల ఆర్థిక ప్రయోజనాలుంటాయి. సొంత పనుల మీద దృష్టి కేంద్రీకరించడం మంచిది. ఇతరులు మిమ్మల్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలలో బాగా బిజీ అయ్యే సూచనలున్నాయి. సన్నిహితులకు సహాయం చేయాల్సి వస్తుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. పిల్లలకు సంబంధించి ఒకటి రెండు శుభవార్తలు వినడం కూడా జరుగుతుంది. ఉద్యోగం మారడానికి సంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
ఈరోజు (11-07-2023)

ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు కూడా తీసుకోవడం మంచిది. పెండింగ్ పనులను నిదానంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుంచి ఆదరణ పెరుగుతుంది. పిల్లలు తాము కోరుకున్న చదువుల్లో, ఉద్యోగాల్లో స్థిరత్వం పొందుతారు. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో లాభాలు గడించడానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. జీవిత భాగస్వామికి సంబంధించి ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. రోడ్డు ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
ఈరోజు (11-07-2023)

ముఖ్యమైన పనులు, వ్యవహారాలు ఆశించినంత తొందరగా పూర్తయ్యే అవకాశం లేదు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. అటు ఉద్యోగంలోనూ, ఇటు కుటుంబంలోనూ పని భారం పెరుగుతుంది. పిల్లల్లో ఒకరు చదువుల కోసమో, ఉద్యోగం కోసం దూర ప్రాంతానికి వెళ్లవలసి వస్తుంది. అనారోగ్యానికి సంబంధించి బంధువుల్లో ఒకరి నుంచి దుర్వార్త వినాల్సి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తి నిపుణులకు క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి సంతృప్తికరంగానే సాగిపోతాయి.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
ఈరోజు (11-07-2023)

ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు చేస్తున్నవారికి శుభ వర్తమానాలు అందుతాయి. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపిస్తారు. వృత్తి జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామికి సంబంధించి ఒక శుభవార్త అందుతుంది. బంధుమిత్రులకు అండగా నిలబడతారు. చిన్ననాటి స్నేహితులలో ఒక విందు కార్యక్రమంలో పాల్గొంటారు. శత్రువులు లేదా ప్రత్యర్థులు మిత్రులుగా మారే అవకాశం ఉంది. ఇతరుల వ్యవహారాలలో తలదూర్చకపోవడం మంచిది.
🦈🦈🦈🦈🦈🦈🦈