ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన దేవాలయం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో రూపుదిద్దుకుంటోంది. ఈ ఆలయాన్ని జస్పూర్ గ్రామంలో నిర్మిస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో ఈ గుడిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. దీంతో పాటు ప్రపంచంలోనే రెండో పెద్ద ట్రీ మ్యూజియంను సైతం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. విశ్వ ఉమియా ధామ్ ఆధ్వర్యంలో ఈ దేవాలయ నిర్మాణం జరగనుంది. సుమారు 504 అడుగుల ఎత్తుతో ఈ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు రూ.వెయ్యి కోట్లు వెచ్చించి ఈ గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ ఆలయ నిర్మాణంలో ఇండో-జర్మన్ సాంకేతికతను వినియోగిస్తున్నారు. భవిష్యత్తులో వచ్చే భూకంపాలు, వరదలను సైతం తట్టుకుని ఉండేలా దీని నిర్మాణం చేస్తున్నారు.
గుజరాత్ లో అత్యంత ఎత్తయిన దేవాలయం నిర్మాణం
