NRI-NRT

ఫిలడెల్ఫియాలో గుంటూరు జిల్లా ప్రవాసుల సమావేశం

ఫిలడెల్ఫియాలో గుంటూరు జిల్లా ప్రవాసుల సమావేశం

23వ తానా మహాసభల్లో గుంటూరు జిల్లా ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీరామ్ ఆలోకం, రామకృష్ణ వాసిరెడ్డి, సుధీర్ ఉమ్మినేని సమన్వయపరిచారు. మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, డాక్టర్ రవి వేమూరి, గోరంట్ల పున్నయ్య చౌదరి, ఫౌండేషన్ ఛైర్మన్ వెంకట రమణ, పాతూరి నాగభూషణం, మన్నవ మోహన కృష్ణ, అన్నాబత్తిన జయలక్ష్మి, డాక్టర్ నిమ్మల శేషయ్య, మురళీ వెన్నం, భాను మాగులూరి, సామినేని కోటేశ్వరరావు, ఘంటా పున్నారావు, రామ్ చౌదరి ఉప్పుటూరి, ఎంవీ రావు, రాజశేఖర్ చెరుకూరి, బుల్లయ్య చౌదరి ఉన్నవ, వెంకట సుబ్బారావు ఆళ్ళ తదితరులు పాల్గొన్నారు.

రాజధాని అమరావతి గుంటూరు జిల్లాలో ఉండటం అందరికీ గర్వకారణమని జిల్లా అభివృద్ధిలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని వక్తలు కోరారు. విద్యావంతులు, కళాకారులకు పుట్టినిల్లు గుంటూరు జిల్లా అని కొనియాడారు. గోరంట్ల పున్నయ్య చౌదరి మాట్లాడుతూ….రెండు దశాబ్దాలకు పైగా గుంటూరులో పేద, ప్రతిభ, గ్రామీణ నేపథ్యం కలిగిన బాలికల వసతిగృహం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతపరచడానికి నూతన భవన నిర్మాణాలకు ప్రవాసంధ్రులు సహాయ సహకారాలు అందించాలని కోరారు. అమరావతి రాజధానిని మార్చడం ఎవరివల్ల సాధ్యం కాదని పాతూరి నాగభూషణం అన్నారు.