NRI-NRT

నాటోలో చేరనున్న స్వీడన్

నాటోలో చేరనున్న  స్వీడన్

నాటో కూటమిలోకి స్వీడన్ చేరేందుకు లైన్ క్లియర్ అయింది. ఆ దేశానికి మెంబర్షిప్ ఇచ్చేందుకు కుదిరిన ఒప్పందానికి నాటో సభ్య దేశాలన్నీ ఓకే చెప్పాయి. అయితే, ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వంపై మాత్రం అదే సాగదీత ధోరణిని కొనసాగించాయి. మంగళవారం లిథువేనియా రాజధాని విల్నియస్ లో జరిగిన నాటో సమిట్ లో కూటమి సభ్య దేశాల అధినేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ మాట్లాడుతూ.. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో)లో స్వీడన్ చేరేందుకు ఒప్పందం కుదరడంపై హర్షం వ్యక్తంచేశారు.

ఉక్రెయిన్​ను కూటమిలో చేర్చుకోవడానికి మాత్రం మరిన్ని అంశాలను పరిశీలించాల్సి ఉందని తెలిపారు. స్వీడన్​కు నాటో సభ్యత్వంపై ఇంతవరకూ తుర్కియే మోకాలు అడ్డగా, సోమవారం రాత్రి ఆ దేశ అధ్యక్షుడు ఎర్దోగన్ ఓకే చెప్పారు. అలాగే, హంగేరి కూడా ఇప్పుడు ఓకే చెప్పింది