Fashion

ఈ చీర ధర తెలిస్తే షాకవ్వాల్సిందే?

ఈ చీర ధర తెలిస్తే షాకవ్వాల్సిందే?

ఆడవారికి చీరలపై ఉండే మక్కువ అంతా ఇంతా కాదు. జీవిత భాగస్వామి నుంచి అతివలు కోరుకునేవాటిలో చీర ముందు వరుసలో ఉంటుంది. పండగలొస్తే ఈ చీరల ధరలు భర్తల జేబులకు పెద్ద చిల్లులే పెడతాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూ వస్త్రదుకాణంలో విక్రయిస్తున్న రూ.21 లక్షల చీర చూస్తే ఏకంగా మతులే పోతాయి. శ్వేతవర్ణంలో అందంగా మెరిసిపోతున్న ఈ చీర దుకాణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వస్త్రం, తయారీ విధానం, కుట్లు వంటి వాటి వల్ల దీనికి ఇంత ధర పలుకుతున్నట్లు వస్త్ర వ్యాపారి తెలిపారు. దీని తయారీకి రెండేళ్లు పట్టిందన్నారు. స్ఫటికాలతో అందంగా అలంకరించిన ఈ చీరకు షిఫాన్‌, చికన్‌కారీ కుట్లే ప్రత్యేక ఆకర్షణ అని చెప్పారు.