ఏపీ నేతన్నలకు శుభవార్త చెప్పింది జగన్ సర్కార్. ఈ నెల 21న చేనేత నేస్తం నిధులు విడుదల చేయనున్నారు. ఈ నెల 21న తిరుపతి జిల్లా.. వెంకటగిరిలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చేనేత నేస్తం నిధులను నేత కార్మికుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం జగన్. ఈ మేరకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.కాగా, బుధవారం సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కీలక భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. మూడున్నర గంటలపాటు సాగిన కేబినెట్ భేటీలో 55 అంశాలపై చర్చించారు. అనైన్డ్‌ల్యాండ్ ఉన్న రైతులకు అనుకూలంగా కేబినెట్ సానుకూల నిర్ణయం తీసుకుంది. అసైన్డ్ ల్యాండ్ పొందిన లబ్ధిదారులు భూమి పొందిన 20 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు అనుభవించేలా కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇతర రైతుల మాదిరిగానే వారికి క్రయ-విక్రయాలపై పూర్తి హక్కులు దక్కుతాయి.మొత్తం 63,191,84 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్స్, లంక భూముల విషయంలో 66,111 మందికి పూర్తి హక్కులు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.