WorldWonders

పాక్ కుటుంబం గిన్నీస్ రికార్డు. కారణం ఇది

పాక్ కుటుంబం గిన్నీస్ రికార్డు. కారణం ఇది

పాకిస్థాన్‌లోని ఓ కుటుంబం పుట్టినరోజు వేడుకలు గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకున్నాయి. ఈ కుటుంబంలోని తొమ్మిది మంది పుట్టినరోజు ఒకేతేదీన కావడంతో ఆ ఘనత దక్కింది. సింధ్‌ ప్రావిన్సులోని లర్కానా నగరానికి చెందిన అమీర్‌ అలి, ఖదీజా దంపతులకు 1992 ఆగస్టు 1న మొదటిపాప పుట్టింది. తర్వాత వరుసగా ఆరుగురు సంతానం అదే తేదీన పుట్టడం విశేషం. ఇలా ఏడుగురు తోబుట్టువుల పుట్టినరోజు ఒకే తేదీన రాగా.. అమీర్‌, ఖదీజా దంపతుల పుట్టినరోజు, పెళ్లిరోజు సైతం అదే తేదీన కావడంతో.. ఆగస్టు 1 వచ్చిందంటే ఆ ఇంట్లో భారీ సంబరాలే. ఈ పాకిస్థానీ కుటుంబం ‘గిన్నిస్‌’ గుర్తింపు సాధించింది. గతంలో అమెరికాకు చెందిన కమిన్స్‌ కుటుంబం పేరిట ఫిబ్రవరి 20న పుట్టిన అయిదుగురు పిల్లలతో  ఈ గిన్నిస్‌ రికార్డు ఉండేది.