NRI-NRT

తానా కోశాధికారిగా వీరవల్లి ప్రవాసుడు రాజా కసుకుర్తి

తానా కోశాధికారిగా వీరవల్లి ప్రవాసుడు రాజా కసుకుర్తి

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) కోశాధికారిగా కృష్ణాజిల్లాకు చెందిన రాజా కసుకుర్తి నియమితులయ్యారు. 2023-25 సంవత్సర కార్యవర్గంలో ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. గతంలో ఆయన తానాలో వివిధ పదవులను నిర్వహించారు. తానా కమ్యూనిటీ సర్వీసెస్‌ కో ఆర్డినేటర్‌, రీజినల్‌ కో ఆర్డినేటర్‌ వంటి పదవులను సమర్థవంతంగా నిర్వహించారు.

కృష్ణాజిల్లా బావులపాడు మండలం వీరవల్లిలో జన్మించిన రాజా కసుకుర్తి ఉన్నత విద్యాభ్యాసంకోసం అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. తానా ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను ఆయన తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించారు. తానా చైతన్యస్రవంతి కార్యక్రమం ద్వారా ఎంతోమందికి ఉచిత కంటి చికిత్స, విద్యార్థులకు ఉపకారవేతనాలు, వృద్ధులకు రగ్గులు, రైతులకు అవసరమైన పరికరాలను అందించారు. తానా నిధుల వ్యవహారాల్లో పారదర్శకంగా వ్యవహరిస్తానని, తెలుగు రాష్ట్ర ప్రజలకు అవసరమైన సేవ, సహాయ కార్యక్రమాలను నిరంతరం చేస్తానని రాజా కసుకుర్తి తెలిపారు. ప్రవాసులు, వీరవల్లి గ్రామస్థులు రాజా కసుకుర్తిని అభినందించారు.

Raja Kasukurthi As TANA Treasurer 2023-25