హీరో సాయిధరమ్ తేజ్ వివాదంలో చిక్కుకున్నారు. శ్రీకాళహస్తిలో సుబ్రహ్మణ్య స్వామికి సాయి ధరమ్ తేజ్ హారతిచ్చారు. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవల్లి దేవసేన సమేతుడైన సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న సాయి ధరమ్ తేజ్.. అర్చకులు లేకపోవడంతో స్వయంగా హారతి ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో.. భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆలయ నియమనిబంధనల ప్రకారం అర్చకులు మాత్రమే స్వామివారికి హారతులివ్వాలని.. సినీ హీరో ఎలా ఇస్తాడంటూ.. ఆలయ అదికారులు, సాయిధరమ్ తేజ్ మీద భక్తులు ఫైర్ అవుతున్నారు. సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే సాయిథరమ్ తేజ్ శ్రీకాళహస్తిలో సుబ్రహ్మణ్య స్వామిని శుక్రవారం దర్శించుకున్నారు. ఆయనను సాధరంగా ఆహ్వానించిన ఆలయ అధికారులు, దర్శనం చేయించారు. ఈ క్రమంలో హారతి వీడియో వెలుగు చూసింది. దీంతో సాయిధరమ్ తేజ్ ను హారతివ్వడానికి ఎలా అనుమతి ఇచ్చారని భక్తులు ప్రశ్నలు సంధిస్తున్నారు.